HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Does Dark Showering Before Bed Actually Help You Sleep Better

డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

పూర్తిగా చీకటిలో కాకుండా కిటికీ నుండి వచ్చే స్వల్ప వెలుతురులో లేదా బాత్‌రూమ్‌లో ఒక కొవ్వొత్తిని వెలిగించి స్నానం చేయవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..!

  • Author : Gopichand Date : 19-02-2026 - 10:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dark Showering
Dark Showering

Dark Showering: శరీరాన్ని శుభ్రంగా, తాజాగా ఉంచుకోవడానికి స్నానం చేయడం చాలా ముఖ్యం. సాధారణంగా అందరూ బాత్‌రూమ్‌లో లైట్లు ఆన్ చేసుకుని స్నానం చేస్తారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘డార్క్ షవరింగ్’ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. బాత్‌రూమ్‌లో లైట్లు ఆర్పేసి చీకటిలో స్నానం చేయడాన్నే డార్క్ షవరింగ్ అంటారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు, ఇది నిద్రలేమి సమస్యను నిజంగానే తగ్గిస్తుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!

ఏమిటి ఈ డార్క్ షవరింగ్?

ఒక్కోసారి స్నానం చేసేటప్పుడు అకస్మాత్తుగా పవర్ పోతే మనం కొద్దిసేపు చీకటిలోనే ఉండాల్సి వస్తుంది. డార్క్ షవరింగ్ కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇది మనం ఇష్టపూర్వక చేసేది. బాత్‌రూమ్ లైట్లు ఆర్పేసి ప్రశాంతంగా స్నానం చేయడమే దీని ప్రత్యేకత. దీనివల్ల నష్టం ఏమీ ఉండదు సరే కదా, కొన్ని లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

స్నానం చేసే సరైన పద్ధతి ఏమిటి?

‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం.. ఈ ట్రెండ్ మన ఆరోగ్యానికి సంబంధించినది. ఇది రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన ఒక ఆయుర్వేద పద్ధతి లాంటిది. ఇది శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సును కూడా శుద్ధి చేస్తుంది.

దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

శరీరంలోని నరాల వ్యవస్థను శాంతపరచడానికి, ధ్యానం చేయడానికి ఇది ఒక గొప్ప మార్గమని నమ్ముతారు. రోజంతా పడ్డ ఒత్తిడిని, ఆందోళనలను ఇది దూరం చేస్తుంది. అయితే పూర్తిగా కటిక చీకటిలో స్నానం చేయడం వల్ల బాత్‌రూమ్‌లో జారిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సరైన వాతావరణం: పూర్తిగా చీకటిలో కాకుండా కిటికీ నుండి వచ్చే స్వల్ప వెలుతురులో లేదా బాత్‌రూమ్‌లో ఒక కొవ్వొత్తిని వెలిగించి స్నానం చేయవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..!

నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది: చీకటిలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఇది త్వరగా, గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. చీకటి వల్ల శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి మెదడును ప్రశాంతపరుస్తుంది.

మానసిక ఆరోగ్యానికి మేలు: చీకటిలో స్నానం చేయడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. కొవ్వొత్తుల వెలుతురులో స్నానం చేయడం వల్ల ఇంట్లోనే ‘స్పా ట్రీట్‌మెంట్’ తీసుకున్న అనుభూతి కలుగుతుంది. మన ఇంద్రియాలపై ఉండే ఒత్తిడిని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

ఇది అద్భుతమైన చికిత్స ఏమీ కాదు.. డాక్టరును సంప్రదించండి!

డార్క్ షవరింగ్ అనేది నిద్రలేమి సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా ఒక మంత్రం లాంటిది కాదు. ఒకవేళ మీరు ఏదైనా ఒత్తిడిలో ఉండి లేదా హడావిడిగా ఈ స్నానం చేస్తే ఎలాంటి లాభం ఉండదు. మీకు నిద్రకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఉంటే తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి. దీనిని కేవలం మనస్సును ప్రశాంతపరుచుకునే ఒక మార్గంగా మాత్రమే చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cortisol
  • Dark Showering
  • health
  • lifestyle
  • meditation
  • Melatonin
  • nervous system

Related News

Organ Donation

అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

ఆలిన్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లినా తన అవయవాల ద్వారా నలుగురు వ్యక్తుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఆమె చేసిన అవయవ దానం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు పునర్జన్మను ఇచ్చింది.

  • Weight Loss Tips

    రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • Overeat

    పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • WHO Warning

    డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • Benjamin Netanyahu

    ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd