HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ishan Kishan Storms Into Top 10 In Latest Icc Rankings

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

ఈ ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సి ఉన్నప్పటికీ ఈశాన్ కిషన్ అసాధారణ ఫామ్‌ను చూసి మేనేజ్‌మెంట్ అతనికే ఓపెనింగ్ బాధ్యతలను అప్పగించింది.

  • Author : Gopi Date : 18-02-2026 - 4:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ishan Kishan
Ishan Kishan

Ishan Kishan: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తన అద్భుతమైన ఫామ్‌తో భారీ జంప్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేసింది. దీనికి ప్రతిఫలంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 17 స్థానాలు ఎగబాకి టాప్-10లోకి దూసుకెళ్లాడు.

టాప్-8లోకి ఇషాన్ కిషన్

తాజా ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ 8వ స్థానానికి చేరుకున్నాడు. గత వారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతను 25వ స్థానంలో ఉండేవాడు. టీమ్ ఇండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన వెంటనే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ప్రస్తుతం 732 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు.

Also Read: ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు..స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌

దీంతో టీ20 టాప్-10 బ్యాటర్ల జాబితాలో భారత్ నుండి నలుగురు ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. ఆ జాబితాలో వీరు ఉన్నారు.

  • అభిషేక్ శర్మ
  • తిలక్ వర్మ
  • సూర్యకుమార్ యాదవ్
  • ఇషాన్ కిషన్

ఇషాన్ కిషన్ అద్భుతమైన పునరాగమనం

దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాలోకి ఘనంగా పునరాగమనం చేశాడు. జట్టులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 373 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఈ ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సి ఉన్నప్పటికీ ఈశాన్ కిషన్ అసాధారణ ఫామ్‌ను చూసి మేనేజ్‌మెంట్ అతనికే ఓపెనింగ్ బాధ్యతలను అప్పగించింది. పాకిస్థాన్‌తో జరిగిన కీలక పోరులో అతను 77 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన ఎంపిక సరైనదేనని నిరూపించుకున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • icc rankings
  • ICC T20 Rankings
  • ishan kishan
  • sports news
  • team india

Related News

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd