Jasprit Bumrah: 400 క్లబ్ లోకి ఎంటర్ కాబోతున్న భూమ్ భూమ్ బుమ్రా
సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో బుమ్రా 400 మ్యాజికల్ ఫిగర్‌ను టచ్ చేయబోతున్నాడు. కేవలం 3 వికెట్లు తెస్తే బుమ్రా 400 అంతర్జాతీయ వికెట్లను పూర్తి చేస్తాడు. ఇదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన 10వ భారత ఆటగాడిగా నిలుస్తాడు
- By Praveen Aluthuru Published Date - 01:19 PM, Sat - 17 August 24

Jasprit Bumrah: కచ్చితమైన యార్కర్లు మరియు స్లో బంతులతో బ్యాట్స్‌మెన్‌లను ఊపిరాడకుండా చేసే జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా పేరొందాడు. అతని ఓవర్లో బ్యాట్స్‌మెన్లు పరుగులు తీయడం కాకుండా మౌనంగా ఉండి వికెట్లను కాపాడుకోవడంపై దృష్టి పెడతారు. బూమ్-బూమ్ బుమ్రా త్వరలో భారీ రికార్డును బ్రేక్ చేయబోతున్నాడు.
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌లో మరోసారి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి స్టార్లు కనిపించనున్నారు. అదే సమయంలో అందరి కళ్ళు జస్ప్రీత్ బుమ్రాపై పడ్డాయి. ఈ సిరీస్ లో బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పనున్నాడు.
సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో బుమ్రా 400 మ్యాజికల్ ఫిగర్‌ను టచ్ చేయబోతున్నాడు. కేవలం 3 వికెట్లు తెస్తే బుమ్రా 400 అంతర్జాతీయ వికెట్లను పూర్తి చేస్తాడు. ఇదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన 10వ భారత ఆటగాడిగా నిలుస్తాడు. అదే సమయంలో 400 వికెట్లు తీసిన రెండో భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు బుమ్రా టెస్టుల్లో 159 వికెట్లు తీశాడు. వన్డేల్లో 149 వికెట్లు, టీ20ల్లో 89 వికెట్లు పడగొట్టాడు.ఇండియా తరుపున అత్యధికంగా అనిల్ కుంబ్లే 953 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ 744 వికెట్లు, హర్భజన్ సింగ్ 707, కపిల్ దేవ్ 687,జహీర్ ఖాన్ 597 వికెట్లు మరియు రవీంద్ర జడేజా 568 వికెట్లు తీసుకున్నారు.
Also Read: Pawan Kalyan : వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్..!