ఐపీఎల్ 2026.. పాయింట్ల పట్టికలో టాప్-6లో ఉన్న జట్లు ఇవే!
ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా జరిగిన ఆరో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఇది సన్‌రైజర్స్‌కు తొలి విజయం.
- Author : Gopichand
Date : 03-04-2026 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2026 Points Table: ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా జరిగిన ఆరో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఇది సన్‌రైజర్స్‌కు తొలి విజయం. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా, వరుసగా రెండో ఓటమిని చవిచూసిన కేకేఆర్ పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 2 వికెట్లు తీసి, 39 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచారు.
పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ స్థానం
మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన హైదరాబాద్ తాజా విజయంతో 2 పాయింట్లు సాధించింది. ఆడిన 2 మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమితో +0.469 నెట్ రన్ రేట్‌ను నమోదు చేసుకుని ఎస్ఆర్హెచ్ పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది.
Also Read: శర్వానంద్ బైకర్ మూవీ ఎలా ఉందంటే?!
కేకేఆర్, ఇతర జట్ల పరిస్థితి
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ -1.964 నెట్ రన్ రేట్‌తో 9వ స్థానానికి పడిపోయింది. 10వ స్థానంలో -4.171 నెట్ రన్ రేట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఇక తన తొలి మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్ (-0.509) 7వ స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ (-1.397) 8వ స్థానంలో కొనసాగుతున్నాయి.
టాప్ ప్లేస్‌లో రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో 2 పాయింట్లతో ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేట్‌తో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో ఉంది.
పాయింట్ల పట్టిక వరుసక్రమం
- రాజస్థాన్ రాయల్స్: +4.171 (1వ స్థానం)
- ఆర్సీబీ: +2.907 (2వ స్థానం)
- ఢిల్లీ క్యాపిటల్స్: +1.397 (3వ స్థానం)
- ముంబై ఇండియన్స్: +0.687 (4వ స్థానం)
- పంజాబ్ కింగ్స్: +0.509 (5వ స్థానం)
- సన్‌రైజర్స్ హైదరాబాద్: +0.469 (6వ స్థానం)
నేటి ఐపీఎల్ మ్యాచ్
ఈరోజు (ఏప్రిల్ 3, 2026) ఐపీఎల్ సీజన్ 19లో భాగంగా 7వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి.