సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్.. ఎవరంటే?!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే జట్టు 2024 సీజన్లో ఫైనల్‌కు చేరుకుంది.
- Author : Gopichand
Date : 18-03-2026 - 6:29 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2026: ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఒక భారీ ప్రకటన చేసింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అదే సమయంలో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. మొదట అందిన సమాచారం ప్రకారం.. అభిషేక్ శర్మ పేరు కెప్టెన్సీ రేసులో వినిపించినప్పటికీ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఉన్న ఫామ్, అతని కెప్టెన్సీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న యాజమాన్యం ఆయనకే ఈ కీలక బాధ్యతను కట్టబెట్టింది.
గాయం కారణంగా పాట్ కమిన్స్ దూరం
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే జట్టు 2024 సీజన్లో ఫైనల్‌కు చేరుకుంది. కానీ టైటిల్ గెలవాలనే కల మాత్రం నెరవేరలేదు. కమిన్స్ కెప్టెన్సీలో జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అయితే గాయం కారణంగా ఆయన ఈసారి ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు. ప్రస్తుతం ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇదే కారణంతో ఆయన టీ20 ప్రపంచకప్‌లో ఆడలేకపోయారు. యాషెస్ సిరీస్‌లో కూడా కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడారు.
𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨
Pat Cummins will miss a few games while recovering from injury.
Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG
— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026
Also Read: YSR Family Property : వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదంలో సరికొత్త ట్విస్ట్
అద్భుతమైన ఫామ్‌కు ఇషాన్ కిషన్‌కు దక్కిన బహుమతి
ఇషాన్ కిషన్ ప్రస్తుతం బ్యాట్‌తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. టీమిండియా తరపున టీ20 ప్రపంచకప్‌లో ఆయన అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్‌ను గెలిపించారు. దీనితో పాటు రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేస్తూ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.