Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. 7వ మహిళా క్రికెటర్‌గా రికార్డు!
100 వన్డేలతో పాటు స్మృతి 7 టెస్ట్ మ్యాచ్‌లు, 148 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. తన 100వ మ్యాచ్‌కు ముందు ఆమె 4288 పరుగులు చేసింది. ఇందులో 10 శతకాలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి.
- By Gopichand Published Date - 11:33 AM, Sun - 4 May 25

Smriti Mandhana: ముక్కోణపు సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ భారత మహిళల క్రికెట్ జట్టు, శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు మధ్య జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత క్రీడాకారిణి స్మృతి మంధానాకు (Smriti Mandhana) ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఆమె 100వ వన్డే మ్యాచ్.
100 వన్డే మ్యాచ్‌లు ఆడిన స్మృతి మంధానా 7వ భారత మహిళా క్రికెటర్. ఆమెకు ముందు 6 మంది క్రీడాకారిణులు ఈ ఫీట్ సాధించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణి కాగా.. ఆమె తన 23 సంవత్సరాల కెరీర్‌లో మొత్తం 232 మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత 204 మ్యాచ్‌లు ఆడిన ఝులన్ గోస్వామి ఉంది. ఈ ఇద్దరు భారత మహిళా క్రికెటర్‌లు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. మూడో స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ ఉంది. ఆమె 191 మ్యాచ్‌లు ఆడింది. అత్యధిక ODI మ్యాచ్‌లు ఆడిన టాప్ 10 భారత మహిళా క్రికెటర్‌లు ఎవరో చూద్దాం.
Also Read: Earthquake: అమెరికా, భారత్‌లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?
- మిథాలీ రాజ్ – 232 మ్యాచ్‌లు
- ఝులన్ గోస్వామి – 204 మ్యాచ్‌లు
- హర్మన్‌ప్రీత్ కౌర్ – 144 మ్యాచ్‌లు
- అంజుమ్ చోప్రా – 127 మ్యాచ్‌లు
- అమితా శర్మ – 116 మ్యాచ్‌లు
- దీప్తి శర్మ – 104 మ్యాచ్‌లు
- స్మృతి మంధానా – 100 మ్యాచ్‌లు
- నీతూ డేవిడ్ – 97 మ్యాచ్‌లు
- నూషిన్ ఖాదీర్ – 78 మ్యాచ్‌లు
- రుమేలీ ధర్ – 78 మ్యాచ్‌లు
𝗔 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹 💯
Congratulations to #TeamIndia vice-captain Smriti Mandhana as she plays her 1⃣0⃣0⃣th ODI today! 👏 👏
Updates ▶️ https://t.co/VYqwYZQ1L8#WomensTriNationSeries2025 | #SLvIND | @mandhana_smriti pic.twitter.com/B70qRq1EVt
— BCCI Women (@BCCIWomen) May 4, 2025
స్మృతి మంధానా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్
100 వన్డేలతో పాటు స్మృతి 7 టెస్ట్ మ్యాచ్‌లు, 148 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. తన 100వ మ్యాచ్‌కు ముందు ఆమె 4288 పరుగులు చేసింది. ఇందులో 10 శతకాలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి. 7 టెస్ట్ మ్యాచ్‌లలో ఆమె 629 పరుగులు చేసింది. టెస్ట్‌లో ఆమె పేరిట 2 శతకాలు, 3 అర్ధశతకాలు ఉన్నాయి. 148 టీ20 మ్యాచ్‌లలో స్మృతి మంధానా 3761 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో ఆమె 30 అర్ధశతకాలు సాధించింది.
త్రికోణ సిరీస్‌లో టాప్‌లో టీమ్ ఇండియా
భారత క్రికెట్ జట్టు మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. 2 మ్యాచ్‌లలో 2 విజయాలతో 4 పాయింట్లతో త్రికోణ సిరీస్ పాయింట్ల టేబుల్‌లో జట్టు టాప్‌లో ఉంది. 2 మ్యాచ్‌లలో 1 విజయంతో శ్రీలంక రెండో స్థానంలో, రెండు మ్యాచ్‌లు ఓడిన దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. అన్ని జట్లు ప్రతి జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. ఆ తర్వాత టాప్ 2 జట్ల మధ్య మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.