HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Won The Toss And Chose To Bat Big Hopes On Kohli

Hopes On Kohli: టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. కోహ్లీపై భారీ ఆశలు

2014లో జ‌రిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల‌లో వ‌రుస‌గా శ‌త‌కాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 115 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో 141 ర‌న్స్ చేశాడు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది.

  • Author : Gopi Date : 06-12-2024 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli Best Innings
Virat Kohli Best Innings

Hopes On Kohli: అడిలైడ్లో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ అడిలైడ్ టెస్టుకు తిరిగివచ్చాడు. రోహిత్ రాకతో మిడిల్ అర్దర్ పటిష్టంగా మారింది. ఇక ఈ టెస్టులో విరాట్ (Hopes On Kohli)పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అడిలైడ్ ఓవ‌ల్‌ వేదిక‌గా జరగనున్న ఈ టెస్టులో కోహ్లీ మరోసారి రెచ్చిపోయే అవకాశముంది. అడిలైడ్ మైదానంలో కోహ్లీకి అద్భుత‌మైన రికార్డుంది. ఈ మైదానంలో విరాట్ ఆడిన నాలుగు టెస్టు మ్యాచుల్లోని 8 ఇన్నింగ్స్‌ల‌లో 63.62 స‌గ‌టుతో 509 భారీ స్కోర్ నమోదు చేశాడు.

2014లో జ‌రిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల‌లో వ‌రుస‌గా శ‌త‌కాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 115 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో 141 ర‌న్స్ చేశాడు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్ తో విశ్వ‌రూపం చూపించాడు. ఇప్పుడు అడిలైడ్ టెస్టులో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. ప్రస్తుతం కోహ్లీ అద్భుత ఫామ్ లోకి వచ్చాడు. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులు మాత్రమే చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 143 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఆడిలైడ్ మైదానంలో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 4 టెస్టులు, 4 వ‌న్డేలు, 3 టీ20ల్లో పాల్గొన్నాడు. ఇందులో మూడు ఫార్మాట్‌లతో సహా అతను 73.61 సగటుతో 957 పరుగులు చేశాడు.

Also Read: Governor Congratulated CM Revanth: సీఎం రేవంత్‌ను అభినందించిన గ‌వ‌ర్న‌ర్‌.. ఎందుకంటే?

అడిలైడ్‌ ఓవల్‌లో కోహ్లీ మొత్తం ఐదు సెంచరీలు సాధించాడు. ఇందులో టెస్టుల్లో మూడు సెంచరీలు, వన్డేల్లో రెండు సెంచరీలు సాధించాడు. అయితే కోహ్లీ మరో శతకం బాదితే ఆసీస్ గడ్డ మీద ఒకే వేదికలో అత్యధిక సెంచరీలు కొట్టిన పర్యాటక బ్యాటర్‌గా కీర్తి గడిస్తాడు. అయితే కోహ్లీ అడిలైడ్ లోనే కాక ఆసీస్ గడ్డపై ఎక్కడైనా రెచ్చిపోతుంటాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి మొత్తం 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 56.03 సగటుతో 1457 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లి 7 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో కోహ్లీ చేసిన 169 పరుగులు ఆస్ట్రేలియాలో అత్యుత్తమ టెస్ట్ స్కోరు. కంగారూ జట్టుపై విరాట్ కోహ్లీ 9 సెంచరీలు చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs AUS
  • India vs Australia
  • Kohli Records
  • Mitchell Starc
  • sports news
  • TeamIndia
  • virat kohli
  • yashasvi jaiswal

Related News

Rohit Sharma-Virat Kohli

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతారు.

  • Chris Gayle

    కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Jofra Archer

    షమీ రికార్డును సమం చేసిన ఆర్చర్!

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

Latest News

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

  • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

  • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd