U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!
అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో ధృడంగా ఉంది.
- By Gopichand Published Date - 11:39 AM, Sun - 29 January 23

అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో ధృడంగా ఉంది. ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి కప్ తీసుకురావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
షెఫాలీ వర్మ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించేందుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. తొలిసారిగా నిర్వహిస్తోన్న ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఆదివారం ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఆదివారం జరిగే మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో యువ బ్యాట్స్‌మెన్ షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ సవాళ్లను ఎదుర్కోనుంది. హర్యానాకు చెందిన షఫాలీ శనివారం నాటికి 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. తన పుట్టినరోజు బహుమతిగా ప్రపంచ కప్ ట్రోఫీని కోరుకుంది. భారత మహిళల జట్టు ఏ విభాగంలోనూ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవలేదు.
సెమీఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్ కు చేరుకుంది. దక్షిణాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్‌లతో కలిసి భారత్ గ్రూప్-డిలో నిలిచింది. గ్రూప్ దశలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఆ తర్వాత యూఏఈపై భారత్ 122 పరుగుల తేడాతో, స్కాట్‌లాండ్‌పై 83 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది.
సూపర్-సిక్స్ దశలో గ్రూప్-1లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి, ఏకైక ఓటమి. దీని తర్వాత సూపర్ సిక్స్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో శ్వేతా సెహ్రావత్ భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తోంది. శ్వేత ఆరు మ్యాచ్‌ల్లో 146 సగటుతో 292 పరుగులు చేసింది. వీటిలో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి కూడా ఆమె.
త్వరలో జరగనున్న సీనియర్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈ ప్రదర్శన ఆధారంగానే ఆమె టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోవచ్చు. అదే సమయంలో, కెప్టెన్ షెఫాలీ ఆరు మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేసింది. ఫైనల్‌లో టీమ్‌ఇండియాకు శుభారంభం అందించాల్సిన బాధ్యత వీరిద్దరిపై ఉంది. అదే సమయంలో పార్శ్వి చోప్రా బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు సాధించింది. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచింది.
Also Read: IND vs NZ: నేడే రెండో టీ20.. టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్
ఇంగ్లండ్ జట్టు గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. వారి గ్రూప్‌లో పాకిస్థాన్, రువాండా, జింబాబ్వే జట్లు ఉన్నాయి. అయితే ఇంగ్లిష్ జట్టు తమ గ్రూప్‌లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ దశలో తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జింబాబ్వేపై 174 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 53 పరుగుల తేడాతో, మూడో మ్యాచ్‌లో రువాండాపై 138 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఇంగ్లండ్ సూపర్ సిక్స్ గ్రూప్-2లో ప్రవేశించింది. ఈ రౌండ్‌లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 121 పరుగుల తేడాతో, వెస్టిండీస్‌పై 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంటే సూపర్ సిక్స్ వరకు ఇంగ్లండ్ భారీ విజయాలను అందుకుంది. సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ తడబడింది. అయితే ఇంగ్లీష్ బౌలర్లు దానిని సరిదిద్దారు. వారి జట్టుకు మూడు పరుగుల విజయాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లతో భారత్ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పోట్చెఫ్‌స్ట్రూమ్‌లోని సెన్వెస్ పార్క్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 5.15 గంటలకు భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దానికి అరగంట ముందు టాస్ జరుగుతుంది.
టీమిండియా: షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సహరావత్, గోంగ్డి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, రిచా ఘోష్, రిషితా బసు, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, పార్శ్వి చోప్రా, సోనమ్ యాదవ్, షబ్నమ్, ఫలక్ నాజ్, సోప్ధాంధీ.
ఇంగ్లండ్: గ్రేస్ స్క్రివెన్స్, ఎల్లీ ఆండర్సన్, హన్నా బేకర్, జోసీ గ్రోవ్స్, లిబర్టీ హీప్, నియామ్ హాలండ్, రాయన్నా మెక్‌డొనాల్డ్-గే, ఎమ్మా మార్లో, చారిస్ పావ్లీ, డేవినా పెర్రిన్, లిజ్జీ స్కాట్, సెరెన్ స్మేల్, సోఫియా స్మేల్, అలెక్సా స్టోన్‌హౌస్.

Related News

Loneliness & Silence: ఒంటరితనమే లోకం.. నిశ్శబ్దమే బంధువుగా వృద్ధుల టౌన్
మన దేశంలో జనాభా పెరుగుతూ పోతోంది. చైనాను కూడా ఇండియా దాటేసే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ టైంలోనూ కేరళలోని పతనంతిట్టా జిల్లా నడిబొడ్డున ఉన్న కుంబనాడ్..