India vs Pakistan Match: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌కు వెళ్తుందా..?
పీసీబీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1న లాహోర్‌లో భారత్-పాక్‌ల (India vs Pakistan Match) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
- By Gopichand Published Date - 02:00 PM, Sun - 7 July 24

India vs Pakistan Match: ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి పంపింది. అయితే ఐసీసీ ఇంకా ధృవీకరించలేదు. పీసీబీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1న లాహోర్‌లో భారత్-పాక్‌ల (India vs Pakistan Match) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను లాహోర్‌లో ఆడాల్సి ఉందని పీసీబీ తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద వార్త బయటకు వచ్చింది. ఈ వార్తతో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
ICC Champions Trophy 2025 :
Group A :-
India 🇮🇳
Pakistan 🇵🇰
Bangladesh 🇧🇩
New Zealand 🇳🇿Group B :-
Australia 🇦🇺
South Africa 🇿🇦
England 🏴
Afghanistan 🇦🇫👉 Which 4 Teams will Qualify for Semi Finals of CT 2025 🤔
Image Credit @Sportskeeda #ChampionsTrophy pic.twitter.com/DBUCZpPd9p
— Richard Kettleborough (@RichKettle07) July 4, 2024
టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లదు: బీసీసీఐ వర్గాలు
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లడం సాధ్యం కాదని, అయితే దీనిపై ఇంకా పెద్దగా చర్చ జరగలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకవేళ టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తే దానిపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని తెలుస్తోంది.
Also Read: Ravindra Jadeja: రవీంద్ర జడేజా లేని లోటును ఈ ఆటగాడు తీర్చగలడా..?
ఇంతకు ముందు కూడా టీమ్ ఇండియా ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్‌కు వెళ్లలేదు. గత సంవత్సరం ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత జట్టు శ్రీలంకలో తన మ్యాచ్‌లను ఆడింది. పాక్‌లో భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం టీమ్‌ఇండియాను పాకిస్తాన్‌కు వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో పాక్ బోర్డు భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో నిర్వహించాయి.
నిజానికి భారతదేశం-పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాల బలహీనత కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు. ఈ రెండు జట్లూ వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య చివరిసారిగా 2012-13 సంవత్సరంలో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌కు వెళ్లలేదు.
We’re now on WhatsApp : Click to Join