HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Can Washington Sundar Fulfill Ravindra Jadeja Place

Ravindra Jadeja: ర‌వీంద్ర జ‌డేజా లేని లోటును ఈ ఆట‌గాడు తీర్చ‌గ‌ల‌డా..?

రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భారత జట్టులో ఏ ఫార్మాట్‌లోనైనా రాణించ‌గ‌ల స‌త్తా ఉన్న ఆట‌గాడు.

  • Author : Gopichand Date : 07-07-2024 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ravindra Jadeja
Ravindra Jadeja

Ravindra Jadeja: T20 ప్రపంచ కప్ 2024 ముగిసిన స‌మ‌యానికి చాలా మంది ఆటగాళ్ళు T20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. వారిలో రవీంద్ర జడేజా ఒకరు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భారత జట్టులో ఏ ఫార్మాట్‌లోనైనా రాణించ‌గ‌ల స‌త్తా ఉన్న ఆట‌గాడు. జడేజా టెస్టు, వన్డే గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు టీ20 క్రికెట్ నుంచి రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత టీమ్ ఇండియాలో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు అన్వేషణ మొదలైంది. ఇందులో మొదటి పేరు వాషింగ్టన్ సుందర్ పేరు వ‌స్తుంది. వాషింగ్టన్ సుందర్ గణాంకాలు కూడా మంచిగానే ఉన్నాయి.

జడేజా లేని లోటును సుందర్ భ‌ర్తీ చేయ‌గ‌ల‌డా?

టాల్ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు ఇప్పటికే అద్భుతమైన టెస్టు రికార్డు ఉంది. 2021లో ఆస్ట్రేలియాపై భారత్‌ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో 6 వికెట్లు తీయడమే కాకుండా సుందర్ బౌలింగ్ యావరేజ్ కూడా చాలా తక్కువ. అయితే ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సుంద‌ర్ అద్భుతంగా రాణించి జ‌డేజా స్థానాన్ని భ‌ర్తీ చేయ‌గ‌ల‌ను అనే న‌మ్మ‌కాన్ని సెలెక్ట‌ర్ల‌కు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Also Read: Terrorist Attack: ఆర్మీ క్యాంపుపై ఉగ్ర‌వాదులు దాడి.. జ‌మ్మూకశ్మీర్‌లో ఘ‌ట‌న‌!

జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా పునరాగమనం చేశాడు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20లోకి పునరాగమనం చేసిన సుందర్ 11 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతను జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. వారిని పరుగులు చేయ‌కుండా ఆప‌డంలో సుంద‌ర్ విజ‌యం సాధించ‌డ‌దానే చెప్పుకోవాలి.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో అసలు అద్భుతం జరిగింది. భారత్ 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి ఓటమి అంచున చేరింది. కానీ సుందర్ పట్టు వదలకుండా ఒంటిచేత్తో మ్యాచ్ గెలవాలని ప్రయత్నించాడు. అతను 35 పరుగులతో పోరాట ఇన్నింగ్స్ ఆడాడు. కానీ భారత్‌ను విజయపథంలో నడిపించలేకపోయాడు. టీ20లో రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయం కాగలడని సుందర్ ఆటతీరు నిరూపించింది. జడేజా రిటైర్మెంట్ తర్వాత అతని స్థానంలో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో సహకారం అందించగల ఆటగాడి కోసం బీసీసీఐ వెతుకుతోంది. సుందర్ రెండు రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. మ‌రీ సెలెక్ట‌ర్లు ఏం చేస్తారో చూడాలి.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI Selectors
  • IND vs ZIM
  • ravindra jadeja
  • T20I
  • TeamIndia
  • washington sundar

Related News

King Kohli Posted An Instag

కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్

Virat Kohli  2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందేశంతో అభినందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “చెటా” అంటూ శాంసన్‌ను అభినందించిన కోహ్లీ, కీలక సమయంలో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఈ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్ టాప

  • Suryakumar Yadav, Gautam Gambhir

    ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd