India vs England: ఐదవ రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తుందా?
ఒకవేళ మొదటి సెషన్‌లో వర్షం కారణంగా ఆట ప్రారంభం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ కీలకమైన మ్యాచ్ ఫలితం లేకుండానే ముగుస్తుంది.
- By Gopichand Published Date - 02:47 PM, Mon - 4 August 25

India vs England: లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో (India vs England) ఐదవ రోజు వాతావరణం గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వాతావరణ అంచనాల ప్రకారం.. ఐదవ రోజు (ఆగస్టు 4) వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ అది మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయకపోవచ్చు. ముఖ్యంగా, మొదటి సెషన్‌లో వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉంది. కేవలం 5 శాతం మాత్రమే. ఈ సమయంలో ఇంగ్లాండ్ జట్టు మిగిలిన 35 పరుగులు సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంది. కానీ టీమ్ ఇండియా కనుక మొదటి గంటలోనే 4 వికెట్లు తీస్తే పరిస్థితి మారుతుంది. ఒకవేళ మొదటి సెషన్‌లో వర్షం పడకుండా ఆట సాగితే మ్యాచ్ ఫలితం త్వరగానే తేలిపోవచ్చు. కానీ మొదటి సెషన్‌లో వర్షం కారణంగా ఆట ఆగిపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది.
భారత జట్టు గెలవాలంటే ఏం చేయాలి?
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు గెలవాలంటే బౌలర్లు అద్భుతాలు చేయాలి. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న జామీ స్మిత్, జామీ ఓవర్టన్, ఆ తర్వాత రాబోయే గస్ ఆట్కిన్సన్ మంచి బ్యాట్స్‌మెన్లు. భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణలు అత్యుత్తమ బౌలింగ్ చేసి మొదటి 10 పరుగుల్లోనే ఈ ముగ్గురినీ ఔట్ చేయగలిగితేనే టీమ్ ఇండియాకు విజయావకాశాలు ఉంటాయి.
Also Read: Athadu Re Release : ‘అతడు’ మళ్లీ వస్తున్నాడు..బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి సునామే !
వాతావరణం అనుకూలించకపోతే?
ఒకవేళ మొదటి సెషన్‌లో వర్షం కారణంగా ఆట ప్రారంభం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ కీలకమైన మ్యాచ్ ఫలితం లేకుండానే ముగుస్తుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ తుది పోరుపై వాతావరణం తన ప్రభావం చూపుతుందా లేదా అనేది వేచి చూడాలి.
భారత్ ఆశలు, ఇంగ్లాండ్ వ్యూహాలు
ప్రస్తుతం ఇంగ్లాండ్ విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే అవసరం కాగా.. భారత్‌కు 4 వికెట్లు కావాలి. మొదటి సెషన్‌లోనే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జామీ స్మిత్, జామీ ఓవర్టన్ త్వరితగతిన పరుగులు చేస్తే భారత్‌కు విజయం సాధించడం కష్టమవుతుంది. మరోవైపు, భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణలు తొలి గంటలోనే అద్భుత ప్రదర్శన చేసి ఈ ముగ్గురినీ పెవిలియన్‌కు పంపగలిగితే, భారత్ విజయం సాధించగలదు.