India Tour Of England: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది!
ప్రస్తుతం భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నేడు మాంచెస్టర్‌లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత్ 2-1తో వెనుకబడి ఉంది.
- Author : Gopichand
Date : 24-07-2025 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
India Tour Of England: ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడుతున్న భారత జట్టు వచ్చే ఏడాది 2026లో మరోసారి ఇంగ్లాండ్ (India Tour Of England)లో పర్యటించనుంది. ఐదు T20 మ్యాచ్‌లు, మూడు ODI మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ల షెడ్యూల్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) గురువారం అధికారికంగా ప్రకటించింది. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ఈ సంవత్సరంతో ఆగకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది.
భారత్-ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ (2026)
- భారత్ vs ఇంగ్లాండ్ T20 సిరీస్ (జులై 1 నుండి జులై 11, 2026 వరకు)
- మొదటి మ్యాచ్: జులై 1 – బ్యాంక్ హోమ్ రివర్‌సైడ్, డర్హామ్
- రెండవ మ్యాచ్: జులై 4 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
- మూడవ మ్యాచ్: జులై 7 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్
- నాల్గవ మ్యాచ్: జులై 9 – సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్
- ఐదవ మ్యాచ్: జులై 11 – యూటిలిటా బౌల్, సౌథాంప్టన్
Also Read: Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!
భారత్ vs ఇంగ్లాండ్ ODI సిరీస్ (జులై 14 నుండి జులై 19, 2026 వరకు)
- మొదటి మ్యాచ్: జులై 14 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
- రెండవ మ్యాచ్: జులై 16 – సోఫియా గార్డన్స్, కార్డిఫ్
- మూడవ మ్యాచ్: జులై 19 – లార్డ్స్, లండన్
ప్రస్తుత టెస్ట్ సిరీస్ పరిస్థితి
ప్రస్తుతం భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నేడు మాంచెస్టర్‌లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత్ 2-1తో వెనుకబడి ఉంది. ఈ ఏడాది (2025) జూన్ 20న భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమైంది. రెండు జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జులై 31 నుండి ఆగస్టు 4 వరకు జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఇరు జట్లకు ప్రాక్టీస్‌కు, అభిమానులకు మరెన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను అందించడానికి దోహదపడతాయి. ఈ సమాచారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా వెలువడిండి.