IND vs AFG: వైరల్ అవుతున్న కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ వీడియో
35 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అద్భుతమైన ఫీల్డింగ్ తో అదరగొడుతున్నాడు. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన చివరి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఫీల్డింగ్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
- Author : Praveen Aluthuru
Date : 18-01-2024 - 5:57 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs AFG: 35 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అద్భుతమైన ఫీల్డింగ్ తో అదరగొడుతున్నాడు. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన చివరి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఫీల్డింగ్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ళు చెదిరే ఫీల్డింగ్ తో టీమిండియాకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
17వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని గాలిలో షాట్ ఆడిన కరీమ్ జన్నత్.. ఫస్ట్ లుక్ లో బంతి బౌండరీ లైన్ దాటి పడిపోతుందేమో అనిపించింది. అయితే విరాట్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ సిక్స్ దిశగా వెళ్తున్న బంతిని మైదానంలోకి విసిరాడు. దీంతో సిక్స్ కాస్త ఒక పరుగుతో సరిపెట్టుకుంది. అయితే మ్యాచ్ లో కోహ్లీ బ్యాట్ తో రాణించలేకపోయినా అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు. మొదటి మ్యాచ్‌కు దూరంగా ఉన్న కింగ్.. రెండో టీ20లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖరి మ్యాచ్‌లోనైనా మెరుపులు మెరిపిస్తాడని అనుకుంటే గోల్డెన్ డక్ తో వెనుదిరిగాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కింగ్ కోహ్లీ గోల్డెన్ డక్‌తో తొలిసారి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఫరీద్ అహ్మద్ వేసిన బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నించగా బంతి గాల్లోకి లేచింది. ఇబ్రహీం జద్రాన్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ ఒడిసిపట్టుకోవడంతో కోహ్లి గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు.
కోహ్లీ డకౌట్ కావడంతో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. కోహ్లీపై వస్తున్న విమర్శలకు కెప్టెన్ రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. విరాట్ ఫస్ట్ బాల్ నుంచే దూకుడుగా ఆడాలని ఫిక్స్ అయ్యాడు. ఇలా ఆడే క్రమంలో కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇందులో తప్పేముంది, తన బలాలు ఏంటో అతడికి బాగా తెలుసునని విమర్శకులకు రోహిత్ శర్మ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. కోహ్లీని ట్రోల్స్ చేస్తున్నవారిపై రోహిత్ స్పందించి తనకు సపోర్ట్ చేయడాన్ని కోహ్లీ ఫాన్స్ హర్షిస్తున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. రోహిత్ శర్మ తుఫాను సెంచరీ సాధించగా, సూపర్ ఓవర్‌లో రవి బిష్ణోయ్ తన స్పిన్నింగ్ బంతులతో మ్యాజిక్ చేశాడు. ఆఫ్గాన్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ మొదలైన దగ్గర నుంచి సంచలనాలతోనే మొదలైంది. యశస్వి జైశ్వాల్ 4, విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. తొలి రెండు టీ 20ల్లో ఇరగదీసి నాటౌట్ గా నిలిచిన శివమ్ దుబె ఈ మ్యాచ్ లో ఒక పరుగుతో నిరాశపరిచాడు. సంజూశాంసన్ ఒక పరుగుతో వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేక పోయాడు. అప్పటికే టీమ్ ఇండియా 22 పరుగులు సాధించి 4 వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో రోహిత్ రింకు సింగ్ చెలరేగిపోయారు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశారు. అయినప్పటికీ ఆఫ్ఘన్ తలొగ్గలేదు. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ లోనూ సత్తా చాటారు. ఈ క్రమంలో రెండు సార్లు సూపర్ ఓవర్లు వేయాల్సి వచ్చింది. అయితే రోహిత్ సూపర్ ఓవర్లోనూ పరుగుల వరద పారించి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. పైగా రవి బిష్ణోయ్ రెండో సూపర్ ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి హీరో ఆఫ్ ది డేగా నిలిచాడు.
Excellent effort near the ropes!
How's that for a save from Virat Kohli 👌👌
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/0AdFb1pnL4
— BCCI (@BCCI) January 17, 2024
Also Read: Health: ఫిట్ నెస్ పై మొగ్గు చూపుతున్న యూత్, కారణమిదే