HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Shock For Smoking Lovers

ధూమపాన ప్రియులకు షాక్..

  • Author : Vamsi Chowdary Korata Date : 19-02-2026 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cigarette Price Hike
Cigarette Price Hike

Itc Hikes Cigarette Prices  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి.

కొంత మందికి ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్లుగా కొందరికి దమ్ము కొట్టందే పొద్దుపోదు. అదేనండీ సిగరెట్ గురించే మాట్లాడేది. సిగరెట్ ప్రియులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘కింగ్’ సైజులో జీఎస్టీ బాదేసింది. 2025 సెప్టెంబర్- అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంతకుముందు 5 శ్లాబులు ఉండగా.. వీటిల్లో 12, 28 శాతం శ్లాబుల్ని తొలగించింది. ప్రస్తుతం 0, 5, 18 శాతం శ్లాబులే ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువ శ్లాబుల్లోని వస్తువులు, ఉత్పత్తులు తక్కువ శ్లాబుల్లోకి చేరగా.. 5 శాతం నుంచి చాలా వరకు జీరో శ్లాబులోకి వచ్చేశాయి. దీనికి అనుగుణంగా ఆయా వస్తువులు, ఉత్పత్తుల ధరల్ని తయారీ కంపెనీలు తగ్గించేశాయి. బైక్స్, కార్లపైనా జీఎస్టీ భారీగా తగ్గింది.

ఇక్కడే కేంద్రం మరో వర్గానికి గట్టి షాక్ ఇచ్చింది. సిగరెట్లు, పాన్ మసాలా సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచడంతో పాటు.. అదనంగా ఎక్సైజ్ సుంకాల్ని కూడా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. సిగరెట్ల పొడవును బట్టి, రకాన్ని బట్టి అదనపు ఎక్సైజ్ డ్యూటీ 1000 సిగర్ స్టిక్స్‌పై రూ. 2050 నుంచి రూ. 8500 వరకు విధించారు. ప్రీమియం, పొడవాటి సిగరెట్లపై ఈ పన్ను భారం ఎక్కువగా ఉండనుంది.

కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా తమపై భారం తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు సిగరెట్ ధరల్ని పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఐటీసీ ఇప్పటికే ధరల్ని పెంచినట్లు తెలుస్తోంది. కనీసం సిగరెట్ బ్రాండ్‌ను బట్టి.. 19 శాతం నుంచి గరిష్ఠంగా 41 శాతం ధరల్ని పెంచినట్లు సమాచారం.

గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం 10 సిగరెట్ల ప్యాకెట్ ధర రూ. 170 నుంచి రూ. 240 కి చేరింది. ఇక్కడ ఒక్కో సిగరెట్ ధర రూ. 7 చొప్పున పెరిగిందన్నమాట. గోల్డ్ ఫ్లేక్ (20s)- క్లాసిక్ (20s) 20 ప్యాక్ ధర రూ. 340 నుంచి రూ. 480 కి చేరింది. క్లాసిక్ కనెక్ట్ (స్లిమ్స్) ధర ఏకంగా 20 శాతం పెరిగి రూ. 300 నుంచి రూ. 360 కి చేరింది. గోల్ట్ ఫ్లేక్ సూపర్‌స్టార్ (వాల్యూ) 10 సిగరెట్ల ప్యాక్ ధర రూ. 59 నుంచి రూ. 70 కి చేరింది. ఇక్కడ 19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. విల్స్ నేవీ కట్ (76MM) ధర గతంలో రూ. 95 గా ఉండగా.. ఈ 10 స్టిక్స్ ప్యాక్ ధర ఇప్పుడు రూ. 120 కి పెరిగినట్లు తెలుస్తోంది.

ఆయా కంపెనీలు తమ లాభాల్ని నిలుపుకునేందుకు.. జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ డ్యూటీ భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీసీతో పాటు ఇతర ప్రముఖ కంపెనీలు గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్ కూడా ధరల్ని పెంచనున్నట్లు తెలుస్తోంది. సిగరెట్ ధరల పెంపు వార్తల నేపథ్యంలో ఫిబ్రవరి 18న ఐటీసీ షేరు 2 శాతానికిపైగా పెరిగి రూ. 332.65 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ రూ. 4.16 లక్షల కోట్లుగా ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 41 Percent
  • breaking news
  • cigarette
  • Cigarette Prices
  • Classic
  • Gold Flake
  • india
  • ITC
  • Itc Hike

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Balochistan has 'declared independence' from Pakistan.

    Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

  • Iranian attacks on US bases in Kuwait and Bahrain

    Kuwait Refinery: హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ హెచ్చరించడంతో.. కువైట్ రిఫైనరీ, బహ్రెయిన్‌లోని అమెరికా మౌలిక సదుపాయాలపై దాడి

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd