Health: ఫిట్ నెస్ పై మొగ్గు చూపుతున్న యూత్, కారణమిదే
- By Balu J Published Date - 05:04 PM, Thu - 18 January 24
Health: ఉరుకుల పరుగుల జీవితంలో అధిక బరువు, ఒత్తిడి, ఇతర అనారోగ్యాలు వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టాలంటే రోజువారి జీవితంలో ఫిట్ నెస్ ను భాగం చేసుకోవాలి. మాదాపూర్, హైటెక్‌సిటీ, మియాపూర్, చందానగర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో జిమ్, ఫిట్నెస్ సెంటర్లకు యువత క్యూ కడుతున్నారు. యువత అభిరుచి మేరకు జిమ్ సెంటర్ల నిర్వాహకులు శిక్షణ ఇస్తున్నారు. సన్నగా ఉండేవారు ధృడంగా తమ శరీరాకృతిని పెంచుకునేందుకు కసరత్తు చేస్తుండగా, లావుగా ఉన్నవారు పొట్ట నడుము, ఇతర అవయువాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు జిమ్ సెంటర్లకు వస్తున్నారు.
ఇక్కడికి వచ్చి వ్యాయామం చేస్తున్న యువతలో ఎక్కువ ఫలితం కనిపించడంతో జిమ్‌లకు వచ్చేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది.ప్రస్తుతం జిమ్‌లను నడపడం నిరుద్యోగ యువతకు ఉపాధిమార్గంగా మారింది. జిమ్‌లకు వచ్చే యువత శరీరాకృతి వృద్ధి చేసుకునేందుకు వ్యాయామశాలలు ఎంతగానో దోహదపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ శరీరంపై శ్రద్ధచూపాలి. వ్యాయామం చేస్తే రోగాలు ధరిచేరకుండా ఉంటాయి. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకుంటే వ్యర్థమే. అందుకోసం కనీసం ఒక గంటపాటు వ్యాయామం చేయాలి.
Related News
Health: బీర్ తాగడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు, అవేంటో తెలుసా
Health: మీరు ప్రతిరోజూ బీర్ తాగితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈరోజుల్లో బీర్ ట్రెండ్ పెరిగిపోవడంతో దాని వల్ల ఎలాంటి హాని జరుగుతుందో తెలియక ప్రజలు దాని వైపు ఆకర్షితులవుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీర్ మిమ్మల్ని కొంత సమయం పాటు ఒత్తిడి లేకుండా చేస్తుంది. కానీ దీర్ఘకాలంలో అది మీకు శారీరక, మానసిక వ్యాధులను కూడా ఇస్తుంది. మీరు కూడా