T20 World Cup 2023: హార్దిక్ కంటే రోహిత్ బెటర్: గంభీర్
ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాపై రకరకాల అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. కోహ్లీ రిటైర్మెంట్ అని ఒకరు, కెప్టెన్ రోహిత్ శర్మ టి20 ఫార్మేట్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఇలా ఏవేవో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.
- By Praveen Aluthuru Published Date - 03:03 PM, Sat - 25 November 23

T20 World Cup 2023: ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియాపై రకరకాల అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. కోహ్లీ రిటైర్మెంట్ అని ఒకరు, కెప్టెన్ రోహిత్ శర్మ టి20 ఫార్మేట్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఇలా ఏవేవో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే త్వరలో బీసీసీఐ రోహిత్ తో భేటీ అవుతుందన్న మాట వాస్తవం. ఆ భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు వినాల్సి వస్తుందోనని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాలని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీని కూడా జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరిగే ప్రపంచకప్‌కు ప్రకటించబోయే జట్టులో ఈ ఇద్దరు స్టార్ పేర్లు కచ్చితంగా ఉండాలని సూచించాడు. అంతేకాకుండా టి20 ప్రపంచకప్ కు టీమిండియాకు నాయకత్వం వహించే అవకాశం రోహిత్ శర్మకు ఇవ్వాలన్నాడు. ప్రస్తుతానికి టి20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కానీ రోహిత్ కెప్టెన్ అయితే బాగుంటుందని గౌతీ చెప్పాడు. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ అద్భుతంగ కెప్టెన్సీ చేశాడని, పవర్‌ప్లేలో రోహిత్ ఆట తీరు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాడు. అందుకే రోహిత్‌ని టీ20ల్లోకి తీసుకోవాలి. రోహిత్ జట్టులోకి వస్తే కోహ్లీ కూడా వస్తాడు అని చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు రోహిత్ శర్మ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అతడిని బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఎంపిక చేయాలని గౌతమ్ గంభీర్ గట్టిగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
Also Read: Vanabhojanalu: వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా.. దాని విశిష్టత ఇదే