టీ20 జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ అవుట్.. గౌతమ్ గంభీర్ మౌనం!
శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించినప్పుడు ఆయన సుదీర్ఘ కాలం జట్టులో ఉంటారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల సమక్షంలో జట్టును ప్రకటించినప్పుడు గిల్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
- Author : Gopichand
Date : 21-12-2025 - 10:55 IST
Published By : Hashtagu Telugu Desk
- టీ20 వరల్డ్ కప్ 2026కు టీమిండియా జట్టు ప్రకటన
- స్క్వాడ్ నుంచి గిల్ ఔట్
- ఈ విషయంపై కోచ్ గంభీర్ మౌనం
Gautam Gambhir: భారత టీ20 జట్టు నుంచి శుభ్‌మన్ గిల్‌ను తప్పించారు. కొన్ని నెలల క్రితమే ఆయనను టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్టు కాంబినేషన్‌లో గిల్ సరిపోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనివల్ల ఆయన 2026 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడే అవకాశం కోల్పోయారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గిల్ తొలగింపుపై గంభీర్ మౌనం
శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించినప్పుడు ఆయన సుదీర్ఘ కాలం జట్టులో ఉంటారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల సమక్షంలో జట్టును ప్రకటించినప్పుడు గిల్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గిల్ స్థానంలో మూడవ ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. ఈ విషయంపై స్పందించమని మీడియా కోరగా గౌతమ్ గంభీర్ ఏమీ మాట్లాడకుండా తన కారులో వెళ్ళిపోయారు. వరల్డ్ కప్ జట్టు ఎంపికపై గంభీర్ మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: మరో ఉద్యమానికి బిఆర్ఎస్ సిద్ధం అవుతుందా ?
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
— BCCI (@BCCI) December 20, 2025
నిరాశపరిచిన గిల్ ప్రదర్శన
టెస్టులు, వన్డేల్లో రాణిస్తున్నప్పటికీ టీ20ల్లో గిల్ తన ముద్ర వేయలేకపోయారు. ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 132 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికాతో ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 32 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ పేలవ ప్రదర్శన వల్లే గిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జట్టు కూర్పు దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్, సెలెక్టర్లు పేర్కొన్నారు.
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు
- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్