Gaddafi Stadium: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. స్టేడియాలపై పాక్ కీలక ప్రకటన!
గడ్డాఫీ స్టేడియం ప్రారంభోత్సవానికి పాక్ గాయకులు అలీ జాఫర్, ఐమా బేగ్, ఆరిఫ్ లోహర్ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
- By Gopichand Published Date - 09:14 AM, Fri - 7 February 25

Gaddafi Stadium: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గడ్డాఫీ స్టేడియం ప్రారంభోత్సవానికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక ప్రకటన చేసింది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం (Gaddafi Stadium) ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిబ్రవరి 8 నుండి ఈ స్టేడియంలో పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరగనుంది. అదే విధంగా ఈ స్టేడియం ప్రారంభోత్సవంలో పాకిస్తాన్‌కు చెందిన చాలా మంది పెద్ద కళాకారులు ప్రేక్షకులను అలరించబోతున్నారు.
Tomorrow at 7 pm InshAllaha pic.twitter.com/QmqgRKQtc8
— Mohsin Naqvi (@MohsinnaqviC42) February 6, 2025
ఈ కళాకారులు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు
గడ్డాఫీ స్టేడియం ప్రారంభోత్సవానికి పాక్ గాయకులు అలీ జాఫర్, ఐమా బేగ్, ఆరిఫ్ లోహర్ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. గడ్డాఫీ స్టేడియం నాలుగు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 22న జరిగే కీలక పోరు, మార్చి 5 నుంచి జరిగే సెమీ-ఫైనల్స్ ఉన్నాయి.
Also Read: H-1B Visa Registration: మార్చి 7 నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఫీజు భారీగా పెంపు!
Massive transformation ✅
Highlights of the stunning upgradation of Gaddafi Stadium 🏟 pic.twitter.com/NUh2cIPKC4
— Pakistan Cricket (@TheRealPCB) February 6, 2025
కరాచీలో ప్రారంభోత్సవం జరగనుంది
లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం తర్వాత కరాచీలోని నేషనల్ స్టేడియం ప్రారంభోత్సవం ఫిబ్రవరి 11న జరగనుంది. లాహోర్ స్టేడియంలో ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు, ఫ్లడ్‌లైట్లు, పెరిగిన సీటింగ్ సామర్థ్యం, ఎలక్ట్రానిక్ స్కోర్‌బోర్డ్‌లు కూడా ఉన్నాయని పిసిబి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ఆందోళనలు, విమర్శలు ఉన్నప్పటికీ సమయానికి స్టేడియంను సిద్ధం చేయడానికి పగలు, రాత్రి శ్రమించిన వారందరికీ నేను కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సమక్షంలో కరాచీలోని నేషనల్ స్టేడియం కోసం మరో ప్రారంభోత్సవ వేడుకను పాక్ నిర్వహించనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు
- మహమ్మద్ రిజ్వాన్(కెప్టెన్), బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్,టయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, కుష్‌దిల్ షా, సల్మాన్ అఘా(వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రర్ అహ్మద్, హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ హస్‌నైన్, నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిది.