Rohit Sharma As Crybaby: టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేసిన ఆసీస్ మీడియా.. మొన్న కోహ్లీ, నేడు రోహిత్!
ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మీడియాలో విరాట్ కోహ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడి మీడియా విరాట్ కోహ్లీని 'కింగ్' అని కూడా రాసింది.
- By Gopichand Published Date - 06:30 AM, Mon - 30 December 24

Rohit Sharma As Crybaby: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సందర్భంగా విరాట్ కోహ్లి తన వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఆస్ట్రేలియన్ మీడియాను లక్ష్యంగా చేసుకున్నాడు. విరాట్ కోహ్లిని విమర్శించడంలో ఆస్ట్రేలియన్ మీడియా సైతం ఏం తక్కువ తినలేదు. ఆస్ట్రేలియా వార్తాపత్రిక విరాట్ కోహ్లీకి జోకర్ అనే పదాన్ని ఉపయోగించింది. దీంతో పాటు అక్కడి మీడియా కూడా కోహ్లీని ఎగతాళి చేసింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా మీడియా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను (Rohit Sharma As Crybaby) టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వార్తాపత్రిక ఇప్పుడు రోహిత్ శర్మ ఫోటోను ట్యాంపర్ చేసింది. ఈ వార్తాపత్రిక సిగ్గులేకుండా అన్ని పరిమితులను దాటిపోయింది.
రోహిత్ శర్మను ఎగతాళి చేశారు
ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మీడియాలో విరాట్ కోహ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడి మీడియా విరాట్ కోహ్లీని ‘కింగ్’ అని కూడా రాసింది. అయితే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ శామ్ కాన్స్టాన్స్, విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీని అక్కడి మీడియా టార్గెట్ చేసింది. అదే సమయంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వార్తాపత్రిక రోహిత్ శర్మను టార్గెట్ చేసింది. రోహిత్ శర్మ ఫోటోను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ఫొటోలో రోహిత్ శర్మకు నోటికి ఓ పాలపీక యాడ్ చేశారు. దాంట్లో బీసీసీఐ లోగో కనపడేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఈ ఫోటోపై “పిల్లవాడిలా ఏడ్చే కెప్టెన్” అని సదరు మీడియా పేర్కొంది.
Also Read: India vs Australia: మెల్‌బోర్న్ టెస్టుకు భారీ సంఖ్యలో అభిమానులు
The back page of tomorrow's The West Australian. pic.twitter.com/Qomh2WhlST
— The West Sport (@TheWestSport) December 29, 2024
ఆస్ట్రేలియా మీడియా ఇటీవల విరాట్ కోహ్లిపై కూడా చెడు పదాలు వాడడం గమనార్హం. ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక తన స్పోర్ట్స్ పేజీలో సామ్ కాన్స్టాస్ ఫోటోను ప్రచురించింది. ఈ ఫోటోలో “విరాట్.. నేను నీ కంటే ముదురుని” అని కాన్స్టాస్ అంటున్నట్లు రాశారు. గతంలో ఓ వార్తాపత్రిక విరాట్ కోహ్లీని జోకర్‌గా చూపించింది. వీటిపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ సదరు ఆసీస్ మీడియా వార్తాపత్రికలపై విమర్శలు చేశారు.
నాలుగో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికర పరిణామానికి దారితీసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల ఆధిక్యం సాధించింది. 5వ రోజు 300 కంటే ఎక్కువ స్కోర్‌లను ఛేజ్ చేయడం భారత్‌కు అంత సులువైన టాస్క్ ఏం కాదు. ఏం జరుగుతుందో చూడాలి మరీ!