India vs New Zealand : వర్షం కారణంగా న్యూజిలాండ్-భారత్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు రద్దు..!
India vs New Zealand : టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న ఇరు జట్లు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ప్లేయర్లు కాస్త నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ రేపు ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానున్నట్లు అంపైర్లు పేర్కొన్నారు.
- Author : Latha Suma
Date : 16-10-2024 - 3:50 IST
Published By : Hashtagu Telugu Desk
India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు జరగాల్సిన మొదటి టెస్ట్ తొలి రోజు ఆట వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరు వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. రాత్రి నుంచి అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు వేచి చూసిన అంపైర్లు.. వర్షం తగ్గకపోవడంతో టాస్ వేయకుండానే మొదటి రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ టెస్ట్ సిరీస్ భారత్ తో పాటుగా న్యూజిలాండ్ జట్టుకు చాలా ముఖ్యం అనే చెప్పాలి.
టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న ఇరు జట్లు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ప్లేయర్లు కాస్త నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ రేపు ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానున్నట్లు అంపైర్లు పేర్కొన్నారు. మరీ రేపటి మ్యాచ్ కు అయిన వర్షం తగ్గి కనుకరిస్తుందా.. లేదా.. వర్షార్పణం అవుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే..!
భారీ వర్షం కారణంగా ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం ఫీల్డ్‌కి కూడా రాలేకపోయారు. ఉదయం నుంచి ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియం మైదానం మొత్తం నీటితో నిండిపోయింది. వర్షం కారణంగా ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు కూడా మైదానంలోకి రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు ఇండోర్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. దీని తర్వాత వంబర్ చివరిలో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో పాల్గొననున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై కఠినమైన సవాలుకు ముందు భారత జట్టు తన బలాన్ని పరీక్షించాలనుకుంటోంది.