HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Famous Franchise That Does Not Want Rishabh Pant

Rishabh Pant: రిషబ్ పంత్‌ని వద్దంటున్న ప్ర‌ముఖ‌ ఫ్రాంచైజీ!

సంజూ శాంసన్ గాయం బారీన పడితే అతని బ్యాకప్‌గా ధృవ్ జురెల్ జట్టులో ఉన్నాడు. 14 కోట్లు చెల్లించి జురెల్‌ను రాజస్థాన్ తన వద్దే ఉంచుకుంది. కాబట్టి ఫ్రాంచైజీ అతనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది.

  • Author : Gopi Date : 20-11-2024 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL Auction Record
IPL Auction Record

Rishabh Pant: ఢిల్లీ విడుదల చేయడంతో 2 కోట్ల బేస్ ప్రైస్ తో రిషబ్ పంత్ (Rishabh Pant) వేలంలోకి వచ్చాడు. సహజంగానే పంత్‌ను కొనుగోలు చేసేందుకు చాలా జట్లు పోటీకి వస్తాయి. ప్రధానంగా చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో ఉంది. ధోనీ అనంతరం ఆ జట్టుకు కీపర్ అవసరం. పంత్ ని తీసుకుంటే కీపింగ్, కెప్టెన్ బాధ్యతలు తీసుకుంటాడు. పైగా పంత్ కోసం ధోనీ ఓ అడుగు ముందుకేసి ఫ్రాంచైజీతో కూడా మాట్లాడట. సో వేలంలో పంత్ కోసం పోటీ పడే జట్లలో చెన్నై ముందంజలో ఉంటుంది. అయితే మిగతా జట్లు కూడా పంత్ ని దక్కించుకోవాలని చూస్తున్నాయి.

కానీ రాజస్థాన్ రాయల్స్ కి పంత్‌ అవసరం ఉండకపోవచ్చు. దానికి 3 కారణాలున్నాయి. ఈ కారణాల కారణంగా రాజస్థాన్ పంత్‌ కోసం వేలంలో పోటీకి దూరంగా ఉండొచ్చు. సంజూ శాంసన్ గత నాలుగేళ్లుగా రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో జట్టు ట్రోఫీని గెలవకపోయినా ఫైనల్స్‌కు చేరింది. సంజు ఒక అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మన్. సో ఆర్ఆర్ కి మరో వికెట్ కీపర్ అవసరం లేదు. దీంతో రాజస్థాన్ కి రిషబ్ పంత్ కోసం వేలంలో పోటీ పడే అవకాశమే లేదు.

Also Read: Congress Ministers: ఎన్నికల‌ ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి

ఒకవేళ సంజూ శాంసన్ గాయం బారీన పడితే అతని బ్యాకప్‌గా ధృవ్ జురెల్ జట్టులో ఉన్నాడు. 14 కోట్లు చెల్లించి జురెల్‌ను రాజస్థాన్ తన వద్దే ఉంచుకుంది. కాబట్టి ఫ్రాంచైజీ అతనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఈ యువ ఆటగాడు తన ఫినిషింగ్ సామర్థ్యంతో గత సీజన్లలో రాజస్థాన్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసినా తుది జట్టుని సెట్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. సో ఈ మూడు రీజన్స్ ని బట్టి చూస్తే ఆర్ఆర్ కి పంత్ అవసరం లేదనిపిస్తుంది.

పైగా ఆర్ఆర్ స్క్వాడ్ కూడా బాగుంది. ఆ జట్టు ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్‌ల ధరను 18 కోట్లుగా ఖరారు చేసింది. రియాన్ పరాగ్, ధ్రువ్‌ జురెల్‌లకు 14 కోట్ల చొప్పున చెల్లించింది. అలాగే షిమ్రాన్‌ హిట్‌మెయర్‌కు 11 కోట్లు, సందీప్ శర్మకు 4 కోట్లు చెల్లించనుంది. గత నాలుగేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోవడంతో సందీప్ శర్మ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రిటైన్ అయ్యాడు. అయితే గత కొన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన జాస్ బట్లర్‌ను విడుదల చేసింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket news
  • Dhruv Jurel
  • IPL 2025
  • IPL 2025 Rishabh Pant
  • Rishabh Pant
  • Rishabh Pant To RR
  • RR
  • Sanju Samson
  • sports news

Related News

This is the real story behind the 'A' symbol celebration for *Sooryavanshi*.

Vaibhav Suryavanshi: సూర్యవంశీ A సింబ‌ల్ సెల‌బ్రేష‌న్ వెనుక అస‌లు కథ ఇదే

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ కుర్రాడు వీరబాదుడు బాదాడు. హాఫ్ సెంచరీ తర్వాత వేళ్లతో ‘A’ సింబల్ చూపిస్తూ చేసిన సంబరాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సీక్రెట్ ఇదే మ్యాచ్ ముగిసిన తర్వాత కామెంటేటర్ మురళీ కార్తీక్ ఆ ‘A’ సింబల్ సెలబ్రేషన్స్ గురించి వైభవ్‌ను అడిగారు. మొదట

    Latest News

    • Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

    • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

    • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

    • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

    • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

    Trending News

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd