HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Dubeys Rampage In Vizag 6 Sixes 2 Fours Carnage

వైజాగ్ లో దూబే తాండవం 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత

  • Author : Vamsi Chowdary Korata Date : 29-01-2026 - 12:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shivam Dube
Shivam Dube

Shivam Dube  న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ – 20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దుబే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, 23 బంతుల్లో 65 పరుగులు సాధించి రికార్డులు సృష్టించాడు. దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగిన దుబే, భారత్ ఓటమిని ఆపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 215 పరుగులు చేయగా.. భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయింది.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దుబే సిక్సర్ల మోతతో వైజాగ్ స్టేడియం హోరెత్తింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో దుబే ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. కివీస్ అందించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పోరాటం మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే చేసిన విధ్వంసకర ఇన్నింగ్స్ మాత్రం అభిమానులకు మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆరంభం ఘోరంగా మారింది. తొలి బంతికే అభిషేక్ శర్మ డకౌట్ కాగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ ఒత్తిడిలో పడింది. సంజూ శాంసన్ వేగంగా పరుగులు సాధించినా, ఆ ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. హార్దిక్ పాండ్యా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజ్‌లోకి వచ్చిన శివమ్ దూబే మ్యాచ్ స్వరూపాన్నే మార్చే ప్రయత్నం చేశాడు. తొలి బంతి నుంచే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన దూబే, కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఘనతతో భారత్ తరఫున మూడో వేగవంతమైన టీ20 అర్ధశతకం సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ (12 బంతులు), అభిషేక్ శర్మ (14 బంతులు) తర్వాతి స్థానంలో దూబే నిలిచాడు.

ముఖ్యంగా లాంగ్ ఆన్, మిడ్‌వికెట్ మధ్యలో భారీ షాట్లతో స్టేడియాన్ని ఊపేశాడు. అతని బ్యాటింగ్ చూస్తే మ్యాచ్ భారత్ వైపు తిరుగుతుందనే ఆశ కలిగింది. అయితే దురదృష్టవశాత్తు 23 బంతుల్లో 65 పరుగులు చేసిన దూబే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. బంతి మ్యాట్ హెన్రీ చేతిని తాకి స్టంప్స్‌ను తాకడంతో క్రీజ్‌కు బయట ఉన్న దూబే ఔట్‌ అయ్యాడు.

దూబే అవుట్ అయిన తర్వాత భారత ఇన్నింగ్స్ పూర్తిగా కుప్పకూలింది. రింకూ సింగ్ కొంత పోరాడినా, అవసరమైన రన్‌రేట్‌ను అందుకోలేకపోయారు. చివరికి భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయి, 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో దూబే 282.60 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. కనీసం 50 పరుగులు చేసిన భారత బ్యాటర్లలో ఇది మూడో అత్యధిక స్ట్రైక్‌రేట్‌గా నమోదైంది. యువరాజ్ సింగ్, అభిషేక్ శర్మ తర్వాతి స్థానంలో ఇప్పుడు శివమ్ దూబే పేరు నిలిచింది.

3 ఓవర్లలో 17 రన్స్.. ఒకే ఓవర్లో 29 పరుగులు..

ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. దీంతో భారత్ చిత్తుగా ఓడటం ఖాయమని భావించారంతా. కానీ భారత సంతతికి చెందిన ఇష్ సోధీ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో దూబే ఆట శివ తాండవాన్ని తలపించింది. తొలి బంతికి రెండు పరుగులు తీసిన దూబే.. మరుసటి బంతికి 4 బాదాడు. దీంతో మూడో బంతిని సోధీ వైడ్ వేయగా.. ఆ తర్వాత దూబే వరుసగా 6 4 6 6 బాదాడు. దీంతో ఆ ఓవర్లో 29 పరుగులు వచ్చాయి.

ఆ దెబ్బతో మళ్లీ దూబే ఔటయ్యాక గానీ.. కివీస్ కెప్టెన్ సోధీతో బౌలింగ్ వేయించలేదు. ఈ ఓవర్ కంటే ముందు రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన సోధీ.. 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే ఇన్నింగ్స్ 17వ ఓవర్ బౌలింగ్ చేసిన సోధీ.. 2 వికెట్లు తీసి 5 రన్స్ ఇచ్చాడు. అంటే మూడు ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్న ఇష్.. దూబే దెబ్బకు ఒకే ఓవర్లో 29 పరుగులు సమర్పించుకున్నాడు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • cricket news
  • Cricket Team India
  • Gautham Gambhir
  • Ind vs NZ
  • IND Vs NZ T20 Match
  • India all-rounder Shivam Dube
  • Shivam Dube
  • sports news
  • Suryakumar Yadav (SKY)
  • T20 matches
  • T20 series
  • vizag

Related News

    Latest News

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd