ICC Men’s T20I Team: ఐసీసీ 2024 అత్యుత్తమ T20 జట్టు ఇదే.. కెప్టెన్‌గా టీమిండియా స్టార్!
భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి జట్టులో ఒక్కొక్కరికి చోటు దక్కింది. కంగారూ జట్టు తరపున ట్రావిస్ హెడ్‌ని చేర్చారు. అలాగే జట్టులో చోటు సంపాదించిన ఏకైక పాక్ ఆటగాడు బాబర్ ఆజం.
- By Gopichand Published Date - 03:58 PM, Sat - 25 January 25

ICC Men’s T20I Team: 2024 సంవత్సరంలో అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ (ICC Men’s T20I Team) ప్రకటించింది. భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇదే సమయంలో టీ-20 ప్రపంచ ఛాంపియన్‌గా భారత్‌ను నిలబెట్టిన రోహిత్ శర్మకు జట్టు కమాండ్ బాధ్యతలు అప్పగించారు. రోహిత్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలకు కూడా జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్ మాత్రమే జట్టులో చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్ నుండి జట్టులో చోటు సంపాదించిన ఏకైక ఆటగాడు బాబర్ ఆజం. అఫ్గానిస్థాన్ ఫాస్ట్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా జట్టులోకి వచ్చాడు.
అత్యుత్తమ టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్
2024 సంవత్సరంలో అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ-20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం గమనార్హం. గత ఏడాది కూడా బ్యాట్‌తో రోహిత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను 11 మ్యాచ్‌లలో 160 స్ట్రైక్ రేట్‌తో 378 పరుగులు చేశాడు. భారత్ తరపున బంతితో అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. బ్యాట్‌తోనూ, బంతితోనూ అదరగొట్టిన హార్దిక్ పాండ్యా కూడా ఈ జట్టులో చోటు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
Also Read: CM Chandrababu : గూగుల్‌కంపెనీ రాక రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
India's Rohit Sharma captains the ICC Men's T20I Team of the Year 2024 🌟
Details ➡️ https://t.co/lK0sdx4Zhc pic.twitter.com/1oecBTeGQG
— ICC (@ICC) January 25, 2025
భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి జట్టులో ఒక్కొక్కరికి చోటు దక్కింది. కంగారూ జట్టు తరపున ట్రావిస్ హెడ్‌ని చేర్చారు. అలాగే జట్టులో చోటు సంపాదించిన ఏకైక పాక్ ఆటగాడు బాబర్ ఆజం. వెస్టిండీస్ నుంచి నికోలస్ పూరన్‌ను జట్టులోకి తీసుకోగా, జింబాబ్వేకు చెందిన సికందర్ రజా కూడా జట్టులో చోటు సంపాదించడంలో సఫలమయ్యాడు. అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక నుంచి వనిందు హసరంగకు జట్టులో చోటు దక్కింది.