Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా ఖాతాలో మరో చెత్త రికార్డు
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి భారత్ టాస్ ఓడిపోవడం మొదలైంది. దీని తర్వాత కేఎల్ రాహుల్ నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ మూడు టాస్‌లను కోల్పోయింది.
- By Gopichand Published Date - 04:48 PM, Thu - 20 February 25

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (Champions Trophy) తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో భారత క్రికెట్ జట్టు ఆడుతోంది. భారత్‌కు అద్భుతమైన రికార్డు ఉన్న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయింది. టాస్ ఓడి ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది.
ODI ప్రపంచ కప్ 2023 ఫైనల్ నుండి టాస్ ఓటమి
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి భారత్ టాస్ ఓడిపోవడం మొదలైంది. దీని తర్వాత కేఎల్ రాహుల్ నాయకత్వంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ మూడు టాస్‌లను కోల్పోయింది. 2024లో భారత జట్టు శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ ఆడింది. అక్కడ కూడా టాస్‌లన్నీ కోల్పోయింది. ఇంగ్లండ్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు టాస్ ఓడిపోయింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో టాస్ ఓడిపోయింది.
Also Read: Google Pay: గూగుల్ పేలో బిల్ పేమెంట్స్ చేస్తున్నారా? బ్యాడ్ న్యూస్
నెదర్లాండ్స్‌ను భారత్ సమం చేసింది
క్రిక్‌బజ్ ప్రకారం.. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుతో సంయుక్తంగా అత్యధికంగా వన్డేల్లో భారత్ వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయింది. మార్చి 2011- ఆగస్టు 2013 మధ్య నెదర్లాండ్స్ 11 సార్లు టాస్ కోల్పోయింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు చెత్త రికార్డును భారత్ జట్టు సమం చేసింది.
టాస్ ఓడిన తర్వాత భారత్ ప్రదర్శన ఎలా ఉంది?
2023 ప్రపంచకప్ ఫైనల్ ఇప్పటికీ భారత అభిమానులకు పీడకలగానే మిగిలిపోయింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత రాహుల్ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత శ్రీలంక వరుసగా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 3-0తో కైవసం చేసుకుంది.
బంగ్లాదేశ్‌పై భారత్‌దే పైచేయి
1988లో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే జరిగింది. ఇరు జట్ల మధ్య 41 వన్డే మ్యాచ్‌లు జరగగా, అందులో భారత జట్టు 32 మ్యాచ్‌ల్లో గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 1 మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాలేదు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే 2023లో జరిగింది. దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరిగాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది.