BCCI Council Meet: బీసీసీఐ కీలక సమావేశం.. ఇకపై కఠినంగా రూల్స్?
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం శనివారం జరిగే సమావేశంలో ఐపీఎల్ విజయం తర్వాత జరిగే ఉత్సవాలకు సంబంధించి నియమాలను రూపొందించే అవసరంపై చర్చ జరగనుంది.
- By Gopichand Published Date - 12:07 PM, Thu - 12 June 25

BCCI Council Meet: ఐపీఎల్ 2025 టైటిల్‌ను ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయం కోసం ఒక పరేడ్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేడియం వెలుపల భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ విషయంపై బీసీసీఐ (BCCI Council Meet) ఐపీఎల్ విజయోత్సవాల కోసం ప్రామాణిక మార్గదర్శకాలు వంటి అంశాలపై చర్చించేందుకు ఒక సమావేశం నిర్వహించనుంది. ఇంకా, బీసీసీఐ సమావేశంలో మరికొన్ని అంశాలపై కూడా చర్చ జరగనుంది.
బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనుంది
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇకపై ఐపీఎల్ విజయం తర్వాత జట్లు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఇకపై కఠినంగా రూపొందించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పుడు ఈ అంశంపై సమావేశంలో లోతైన చర్చ జరగనుంది. ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం.
Also Read: The India House: ది ఇండియా హౌస్ మూవీ సెట్‌లో ప్రమాదం.. స్పందించిన హీరో నిఖిల్!
BCCI APEX COUNCIL MEETING ON SATURDAY. [Bharat Sharma from PTI]
– Guidelines for future IPL celebrations
– Venues for India vs New Zealand series in January 2026
– Domestic fixture for 2025-26
– Review of the existing Age verification rule
– Code of conduct & allowance for new… pic.twitter.com/jSurECsDKm— Johns. (@CricCrazyJohns) June 12, 2025
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం శనివారం జరిగే సమావేశంలో ఐపీఎల్ విజయం తర్వాత జరిగే ఉత్సవాలకు సంబంధించి నియమాలను రూపొందించే అవసరంపై చర్చ జరగనుంది. అంతేకాకుండా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగే సిరీస్‌కు సంబంధించిన వేదికలపై కూడా చర్చించనున్నారు.
జూన్ 4న బెంగళూరులో తొక్కిసలాట
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత రోజు దాదాపు 3 లక్షల మంది అభిమానులు తమ ఇష్టమైన ఆటగాళ్లను ఒక్కసారి చూసేందుకు ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల గుమిగూడారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 50 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత కొందరు ఆర్సీబీ నుండి కర్ణాటక ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు.