HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Water Tank Burst Floods Ram Charan Nikhils The India House Set Many Injured

The India House: ది ఇండియా హౌస్ మూవీ సెట్‌లో ప్ర‌మాదం.. స్పందించిన హీరో నిఖిల్‌!

ప్రమాదం కారణంగా సెట్‌లోని కెమెరాలు, లైటింగ్ సామ‌గ్రి, ఇతర సామగ్రి దెబ్బతినడంతో చిత్ర యూనిట్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • By Gopichand Published Date - 11:53 AM, Thu - 12 June 25
  • daily-hunt
The India House
The India House

The India House: హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్ (The India House) షూటింగ్ సమయంలో హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జూన్ 11న భారీ ప్రమాదం జరిగింది. సముద్ర సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో సెట్ మొత్తం నీటితో మునిగిపోయింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. గాయపడినవారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ప్రమాదం కారణంగా సెట్‌లోని కెమెరాలు, లైటింగ్ సామ‌గ్రి, ఇతర సామగ్రి దెబ్బతినడంతో చిత్ర యూనిట్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రమాద సమయంలో నిఖిల్ సెట్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ముందు షాట్ బ్రేక్‌లో హీరో నిఖిల్ ప‌క్కకు వెళ్లిన‌ట్లు స‌మాచారం. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో అసిస్టెంట్ కెమెరామెన్‌కు కాళ్లు విరిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే హీరో నిఖిల్‌ క్షేమంగా ఉన్నట్లు నిర్మాతలు ప్రకటించారు. షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయగా, భద్రతా చర్యలపై చిత్ర బృందం దృష్టి సారించింది.

Also Read: Honeymoon Murder: హనీమూన్ హత్య కేసులో మ‌రిన్ని సంచలన విషయాలు!

We r all Safe 🙏🏽
Sometimes in our Quest to give the Best cinematic Experience we take Risks. Today we survived a Huge mishap thanks to the Alert Crew and Precautions taken.
We lost Expensive Equipment but by gods grace there was no human damage 🙏🏽 #IndiaHouse https://t.co/uhrHjOUtFx

— Nikhil Siddhartha (@actor_Nikhil) June 12, 2025

ది ఇండియా హౌస్ చిత్రాన్ని రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా, రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 1905 నాటి స్వాతంత్య్ర‌ సమర నేపథ్యంలో రాజకీయ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రమాదం షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం చూపినప్పటికీ.. త్వరలో చిత్రీకరణ పునఃప్రారంభమవుతుందని భావిస్తున్నారు. నిఖిల్.. కార్తికేయ 2 వంటి విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు.

హీరో నిఖిల్ స్పంద‌న‌

తాజాగా ఈ ఘ‌ట‌న‌పై హీరో నిఖిల్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. త‌న‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని వెల్ల‌డించారు. ఈరోజు మేము ఒక పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌పడ్డాం. మేము ఖ‌రీదైన ప‌రిక‌రాల‌ను కోల్పోయాం. కానీ దేవుడి ద‌య వ‌ల్ల ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు అని ట్వీట్ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • Movie Set
  • Nikhil Siddhartha
  • ram charan
  • The India House
  • tollywood

Related News

Chikiri Peddi

Peddi : పెద్ది ఫస్ట్ ప్రోమో..ఇది కదా రహమాన్ నుండి కోరుకుంటుంది !!

Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి

  • Bilaspur Train Accident

    Bilaspur Train Accident: బిలాస్‌పూర్ స్టేషన్ సమీపంలో రెండు రెళ్లు ఢీ!

  • Chevella Road Accident Bala

    Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

  • Janhvi Kapoor

    Janhvi Kapoor: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్‌.. చ‌రణ్ మూవీలో జాన్వీ పాత్ర ఇదే!

  • Mass Jathara Review

    Ravi Teja : మాస్ జాతర’తో హిట్ కొట్టాం.!

Latest News

  • Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

  • Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

  • Royal Enfield Bullet 650: బుల్లెట్ బైక్ కొనాల‌నుకునేవారికి అదిరిపోయే శుభ‌వార్త‌!

  • Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెట‌ర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్‌!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd