Asia Cup 2023: ఆసియ కప్ 2023 టీమిండియా జట్టు ఇదే
ప్రపంచ కప్ కు ముందు టీమిండియా ఆసియా కప్ లో తలపడనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 21-08-2023 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
Asia Cup 2023: ప్రపంచ కప్ కు ముందు టీమిండియా ఆసియా కప్ లో తలపడనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. మహ్మద్ షమీ మరియు మహ్మద్ సిరాజ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఏడాది విరామం తరువాత జస్ప్రీత్ బుమ్రా మైదానంలో అడుగుపెట్టాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైనా బుమ్రా ఐర్లాండ్ ముడు టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్ లో రెండు ఖరీదైన వికెట్లను పడగొట్టిన రెండో మ్యాచ్ లోనూ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే టీ20 తర్వాత బుమ్రా ఆసియ కప్ లో 50 ఓవర్ల ఫార్మెట్లో ఆడనున్నాడు. ఇందులో బుమ్రా తనను తాను నిరూపించుకోవాలి. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్లకు జట్టులో స్థానం కల్పించింది బీసీసీఐ.
ఆసియా కప్ 2023 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Also Read: Baby Director Sai Rajesh : బేబీ డైరెక్టర్ ఇలాంటి షాక్ ఇచ్చాడేంటి..?