Baby Director Sai Rajesh : బేబీ డైరెక్టర్ ఇలాంటి షాక్ ఇచ్చాడేంటి..?
డైరెక్టర్ సాయి రాజేష్ అభిమానులకు , నెటిజన్లకు , ఫాలోయర్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు
- Author : Sudheer
Date : 21-08-2023 - 2:28 IST
Published By : Hashtagu Telugu Desk
కథలో దమ్ము ఉండాలే కానీ ఎన్ని ఓటిటి లు వచ్చిన , పైరసీ లు వచ్చిన ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమాను చూస్తారని మరోసారి బేబీ (Baby Movie) సినిమా నిరూపించింది. ప్రస్తుతం సినీ జనాలకు ఏం కావాలో..? ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో..? అలాంటిది తీసుకొచ్చారు డైరెక్టర్ సాయి రాజేష్. చిన్న హీరో ఆనంద్ దేవరకొండ తో , షార్ట్ ఫిలిమ్స్ ఫేమ్ తో గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి(Vaishnavi Chaitanya)ని హీరోయిన్ గా పరిచయం చేసి నిర్మాత SKN భారీ విజయాన్ని అందుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల లాభాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదలై దాదాపు నెల రోజులకు దగ్గర పడుతున్న కానీ ఇంకా థియేటర్స్ లలో సందడి చేస్తుంది.
ఇదిలా ఉంటె ఈ నెల 25 నుండి ఈ మూవీ ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ తరుణంలో డైరెక్టర్ సాయి రాజేష్ అభిమానులకు , నెటిజన్లకు , ఫాలోయర్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సాయి రాజేష్.. ‘బేబీ’ డిజిటల్ ప్రీమియర్ (Baby Digital Premier) కు ముందు తన ట్విట్టర్ అకౌంట్ ను డీ ఆక్టివేట్ (Baby Director Sai Rajesh Twitter Account) చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అనే విషయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. అసలు కారణం ఏంటనేది ఎవరికీ తెలియనప్పటికీ, రాబోయే తన ప్రాజెక్టు విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ అకౌంట్ ను డి-ఆక్టివేట్ చేసినప్పటికీ, ఇన్ స్టాలో మాత్రం సాయి రాజేష్ యాక్టివ్ గానే ఉన్నారు.
Read Also : Mahesh Babu: ఫ్యామిలీతో టూర్లకెళ్లడం తప్పా.. ట్రోల్స్ పై మహేశ్ రియాక్షన్