Ahmedabad Pitch: అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ క్యా హై?
నాగ్‌పూర్, ఢిల్లీ, ఇండోర్ వేదిక మారినా ఫలితం మాత్రం మూడు రోజుల్లోనే వచ్చేస్తోంది.. ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్ సగం రోజులకే ముగిసిపోతుందంటూ
- By Maheswara Rao Nadella Published Date - 07:47 PM, Mon - 6 March 23

నాగ్‌పూర్, ఢిల్లీ, ఇండోర్ వేదిక మారినా ఫలితం మాత్రం మూడు రోజుల్లోనే వచ్చేస్తోంది.. ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్ సగం రోజులకే ముగిసిపోతుందంటూ ప్రత్యర్థి జట్టు మాజీలు, మీడియా విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్ కూడా 3 రోజుల్లోపే ముగుస్తుందా.. అహ్మదాబాద్ పిచ్ (Ahmedabad Pitch) ఎలా ఉండబోతోంది…ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. నిజానికి క్రికెట్‌లో పిచ్‌లు ఆతిథ్య దేశానికి అనుకూలంగా తయారు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్..ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆయా ఆతిథ్య దేశాలకు అనుకూలించే పిచ్‌లే ఉంటాయి. సొంత పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను నిలువరించడం కామనే.. ఇలాంటి పిచ్‌లపై ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ గెలిస్తే గొప్ప ఘనతే. అయితే భారత్‌కు వచ్చేటప్పటికి మాత్రం పిచ్‌ల విషయంలో విదేశీ జట్లు విమర్శలు గుప్పిస్తుంటాయి. నిజానికి ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు ఫేవర్‌గా ఉండడం సహజమే. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్నర్ల ఆధపత్యమే కనిపిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టులూ 3 రోజుల లోపే ముగిసిపోయాయి.
నాగ్‌పూర్ పిచ్‌ను చూస్తే బంతి బాగా టర్న్ అయింది. ఈ పిచ్‌పై మన బ్యాటర్లు రాణించినా.. ఆసీస్ బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో గెలిచింది. తర్వాత ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి.. అయితే ఈ సారి ఆసీస్ స్పిన్నర్లు కూడా రాణించారు. భారత బ్యాటర్లు కొంత తడబడినా.. చివరికి మనదే పైచేయిగా నిలిచింది. దీంతో ఆధిక్యం 2-0కు పెరిగిన వేళ.. మరోసారి పిచ్‌పై ఆసీస్ మాజీలు, మీడియా విమర్శలు గుప్పించాయి. దీనికి కెప్టెన్ రోహిత్‌శర్మ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆటగాళ్ళ సత్తా చూడాలని, పిచ్ గురించి ఎక్కువ ఆలోచించడం సరికాదంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఇండోర్‌లో మాత్రం భారత్ వ్యూహం బెడిసికొట్టింది. మరోసారి స్పిన్ పిచ్‌తోనే ఆసీస్‌ను దెబ్బతీయాలనుకున్న టీమిండియా తానే ఈ వ్యూహంలో చిక్కుకుని చిత్తుగా ఓడింది. గెలిచిన తర్వాత ఆసీస్ పిచ్‌లపై ఎలాంటి విమర్శలు చేయలేదు.
ఓవరాల్‌గా మూడు టెస్టులూ 3 రోజుల్లోనే ముగియడం మాత్రం మాజీ ఆటగాళ్ళను నిరాశకు గురి చేసాయి. కొందరు పిచ్‌లను సమర్థిస్తే.. మరికొందరు మాత్రం ఐదు రోజుల్లో ఫలితం వచ్చేలా రూపొందించాలని సూచించారు. కాగా ఇప్పుడు అందరి దృష్టీ అహ్మదాబాద్ పిచ్ (Ahmedabad Pitch) పై పడింది. మొదటి మూడు టెస్టులూ సగం రోజులకే ముగిసిపోవడంతో చివరి టెస్టు ఎన్ని రోజులు జరుగుతుందన్న చర్చ మొదలైంది. అయితే పిచ్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో సాధారణంగా ఇక్కడ తయారు చేసే పిచ్‌నే క్యూరేటర్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్ ఐదు రోజుల పాటు జరిగే అవకాశముంది.
Also Read: Oatmeal Water: ఓట్ మీల్ వాటర్ ను ఉదయాన్నే ఖాళీ పొట్టతో తాగితే వచ్చే ఆర్యోగ్య ప్రయోజనాలు ఇవే.

Related News

World Cup 2023: పాక్ కోసం బాంగ్లాదేశ్ లో ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఇది నిజమేనా..?
భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం కారణంగా క్రికెట్‌పై భారం పడుతోంది. ఇప్పటికే ఆసియా కప్ విషయంలో ఇరు దేశాల మధ్య పోరు సాగుతుండగా.. ఇప్పుడు 50 ఓవర్ల ప్రపంచకప్ (World Cup 2023)పై వచ్చిన వార్త క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.