HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >A Rare Honor For Bccis Gurus And Disciples

బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2026 - 2:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bcci Col Ck Nayudu Lifetime Achievement Award
Bcci Col Ck Nayudu Lifetime Achievement Award

BCCI  భారత క్రికెట్‌కు చేసిన విశేష సేవలకుగాను మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ అత్యున్నత గౌరవం ఇవ్వనుంది. మార్చి 15న ఢిల్లీలో జరిగే నామన్ అవార్డ్స్ కార్యక్రమంలో కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో ఆయనను సత్కరించనున్నారు. 16 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో ద్రావిడ్ భారత్ తరఫున 509 మ్యాచ్‌లు ఆడి అద్భుత రికార్డులు నెలకొల్పారు. తర్వాత కోచ్‌గా కూడా టీమిండియాకు సేవలందించి 2024 టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత క్రికెట్‌కు చేసిన అపార సేవలకుగాను మాజీ భారత క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు ప్రత్యేక గౌరవం లభించనుంది. బీసీసీఐ నిర్వహించే వార్షిక నామన్ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆయనకు కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందించనున్నారు. నేషనల్ మీడియా కథనం ప్రకారం, ఈ అవార్డును మార్చి 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ద్రావిడ్‌కు ప్రదానం చేయనున్నారు.

రాహుల్ ద్రావిడ్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన భారత క్రికెట్‌లో ప్రసిద్ధి చెందిన ‘బిగ్ ఫోర్’ బ్యాటింగ్ లైనప్లో ఒకరు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఇక ఈ నామన్ అవార్డ్స్ కార్యక్రమంలో భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌కు కూడా లైఫ్‌టైమ్ గౌరవం ఇవ్వనున్నారు.

దాదాపు 16 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో ద్రావిడ్ భారత్ తరఫున మొత్తం 509 మ్యాచ్‌లు ఆడారు. టెస్ట్ క్రికెట్‌లో 164 మ్యాచ్‌లు ఆడి 13,288 పరుగులు చేశారు. ఆయన సగటు 52.31 కాగా, అందులో 36 శతకాలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో కూడా ద్రావిడ్ అద్భుత ప్రదర్శన చేశారు. 344 వన్డే మ్యాచ్‌లలో 10,889 పరుగులు సాధించారు. ఇందులో 12 శతకాలు, 83 అర్ధశతకాలు ఉన్నాయి.

టీ20 అంతర్జాతీయాల్లో మాత్రం ద్రావిడ్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడారు. 2011లో ఇంగ్లండ్‌పై మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆయన టీమిండియా తరఫున ఆడారు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ద్రావిడ్ కొంతకాలం కామెంటేటర్‌గా పనిచేశాడు. అనంతరం కోచింగ్ రంగంలోకి ప్రవేశించాడు. అండర్ – 19 కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 2018లో జరిగిన ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపాడు. అదే సమయంలో ఇండియా ఏ జట్టుకు కూడా మార్గనిర్దేశనం చేశాడు.

2021 చివర్లో ఆయన టీమిండియా సీనియర్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఆయన కోచింగ్ సమయంలో భారత్ 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌కు చేరింది. అనంతరం 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విజేతగా నిలిచి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఇటీవల టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా భారత జట్టు సాధించిన మూడో టీ20 వరల్డ్ కప్ విజయాన్ని రాహుల్ ద్రావిడ్‌కు అంకితం చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, “మొదటిగా ఈ ట్రోఫీని రాహుల్ భాయ్‌కు అంకితం చేయాలి. భారత క్రికెట్‌ను మంచి స్థితిలో ఉంచడానికి ఆయన చేసిన సేవలు అపారమైనవి. ఆయన తన పదవీకాలంలో చేసిన ప్రతిదానికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను” అని గంభీర్ పేర్కొన్నాడు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • BCCI Awards
  • Bcci Col Ck Nayudu Lifetime Achievement Award
  • Col Ck Nayudu Lifetime Achievement Award
  • cricket news
  • Naman Awards 2026
  • rahul dravid
  • Shubman Gill

Related News

Ipl 2026 Playoffs

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇం

  • Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

    NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

  • Who is Team India's new T20 captain?

    T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

    Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

  • BCCI Announces IPL 2026 Playoffs schedule

    IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

Latest News

  • Liquor Shops: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం

  • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd