HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Worshipping Hanuman Brings Nothing But Success

Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

  • Author : Vamsi Chowdary Korata Date : 12-05-2026 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hanuman Jayanti 2026
Hanuman Jayanti 2026

ఆంజనేయుని బలం అనంతం. ఆయన శక్తికి, ధైర్యానికి మారుపేరు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలు, సమస్యలు సమసిపోతాయి. ఆంజనేయుని నమ్ముకుంటే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలు కలిగినప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. కొన్ని ఆలయాలలో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతుని వీరాంజనేయుడు, యోగాంజనేయుడు, భక్తాంజనేయుడు, ధ్యానాంజనేయుడు, దాసాంజనేయుడు అనే నామాలతో భక్తులు పూజిస్తారు, అభిషేకాలు చేస్తారు. హనుమంతునికి సింధూర అభిషేకం అంటే చాలా ఇష్టం.

ఆకు పూజ అంటే కూడా హనుమంతునికి ఎంతో ప్రీతి. ఇంకా చెప్పాలంటే తీపి అప్పాలు, వడలు అంటే ఆయనకు చాలా ఇష్టం. హనుమంతుని దర్శనం చేసుకున్న తరువాత స్వామివారికి 11 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత స్వామివారికి సింధూరాభిషేకం, ఆకు పూజలు చేయించి నైవేద్యంగా అప్పాలు, వడలు సమర్పించాలి. ఇలా హనుమంతునికి పూజలు చేయడం వలన స్వామివారు ప్రీతి చెందుతారు. హనుమస్వామి అనుగ్రహం వలన భయాలు, బాధలు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోయి జీవితంలో ఆనందకరమైన సిరిసంపదలతో ఉంటారని ఆధ్యాత్మిక గ్రంథాలలో స్పష్టం చేయబడింది.

చైత్ర శుక్ల పూర్ణిమ నాడు మాత్రమే గాకుండా ఆంజనేయ స్వామిని శనివారం, మంగళవారం, గురువారాల్లో కూడా పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. శని తన అపరాధాన్ని మన్నించమని వేడుకోగా, స్వామి తనను, తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర సంవత్సరాల శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే హనుమాన్ జయంతికి ప్రత్యేకత ఉంటుంది. ఇక హనుమాన్ యాత్ర అనగానే రాజకీయ పార్టీలకు అతీతంగా యువత పెద్ద ఎత్తున కదిలి వస్తారు. వివిధ పార్టీల జెండాలు అన్ని తమ తమ ఇళ్లలోనే ఉంచి, హనుమాన్ జయంతి ర్యాలీలో మాత్రం కాషాయ జెండాలు ప్రదర్శించడం హిందూ ఐక్యతకు చిహ్నం. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్సార్ టీపీ, ఆప్ ఇలా అన్ని ప్రముఖ పార్టీల నాయకులకు బజరంగ్ దళ్ ఆహ్వానం అందజేసింది. దాదాపు లక్షా 26 వేల బైకులు, 6 వేల ఫోర్ వీలర్ లు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొంటాయని అంచనా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • hanuman chalisa
  • hanuman jayanti
  • Hanuman Jayanti celebrations
  • Hanuman Jayanti Puja

Related News

Why should a husband and wife stay apart during the month of Ashadha?

Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ మాసం రాగానే కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం మన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే దీని వెనుక కేవలం సెంటిమెంట్లు, నమ్మకాలు మాత్రమే కాకుండా పూర్వీకులు ఆలోచించిన అద్భుతమైన వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగి ఉన్న

  • Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

    Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd