HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kohlis Teammate Punjab Kings Player Passes Away

Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

  • Author : Vamsi Chowdary Korata Date : 07-05-2026 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace
Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

భారత క్రికెట్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. భారత మాజీ అండర్-19, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో మృతి చెందారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 జట్టులో ఆడిన అమన్‌ప్రీత్ హఠాన్మరణం క్రీడా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అమన్‌ప్రీత్ సింగ్ గిల్ పంజాబ్ తరఫున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టారు. 2008లో జరిగిన ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఆయన పంజాబ్ ఫ్రాంచైజీ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించారు. 2007లో భారత అండర్-19 జట్టు తరఫున ఐదు యూత్ వన్డేలు, ఒక యూత్ టెస్టు ఆడారు. ఆ టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా వికెట్‌ను కూడా తీశారు. అయితే, 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన భారత అండర్-19 జట్టులో మాత్రం ఆయనకు స్థానం దక్కలేదు.

అమన్‌ప్రీత్ మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. “పంజాబ్ మాజీ క్రికెటర్, సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని పీసీఏ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.

సంతాపం తెలిపిన యువరాజ్ సింగ్
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అమన్‌ప్రీత్‌కు నివాళులర్పించారు. “అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. మా కెరీర్ ఆరంభ రోజుల్లో మేము డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాం. అతను నిశ్శబ్దంగా, కష్టపడి పనిచేసే క్రికెటర్. ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి. ఓం శాంతి” అని యువరాజ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అమన్‌ప్రీత్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amanpreet Singh Gill
  • cricket news
  • IPL
  • punjab kings XI
  • rest in peace
  • virat kohli
  • yuvaraj singh

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd