HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >5 Interesting Facts Of The Great Wall Of India

Happy Birthday Rahul Dravid: నేడు గ్రేట్‌వాల్‌ ద్రవిడ్‌ పుట్టిన రోజు.. ద్రవిడ్‌ గురించి ఇవి తెలుసా..?

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియాగా పిలవబడే భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) బుధవారం తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాకు ఆయన 13 ఏళ్లపాటు క్రికెట్‌ సేవలందించారు.

  • Author : Gopi Date : 11-01-2023 - 12:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Dravid
Rahul Dravid

గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియాగా పిలవబడే భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) బుధవారం తన 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియాకు ఆయన 13 ఏళ్లపాటు క్రికెట్‌ సేవలందించారు. భారత్‌ కష్టాల్లో ఉన్న ప్రతీసారి వికెట్ల మధ్య అడ్డుగోడలా నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ది వాల్, మిస్టర్ డిఫెండబుల్‌గా పేరుగాంచిన ద్రావిడ్.. తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. క్రికెట్ నుంచి రిటైరైనా.. అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచ్ గా వ్యవహరించారు. ప్రస్తుతం టీమిండియా కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జనవరి 11, 1973 ఇండోర్‌లో జన్మించిన ద్రవిడ్‌.. టెస్టు మ్యాచ్ తో క్రికెట్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.

Also Read: Rohit Sharma: క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ.. ఏం చేశాడో తెలుసా..!

టెస్టు క్రికెట్‌లో అత్యధిక బంతులు: టెస్టు క్రికెట్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్‌మెన్ ద్రవిడ్ మాత్రమే. అతను గేమ్‌లోని సుదీర్ఘ ఫార్మాట్‌లో మొత్తం 31,258 బంతులు ఎదుర్కొన్నాడు.

టెస్టుల్లో గోల్డెన్ డక్‌ లేదు: తాను ఆడిన 286 టెస్టు ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్ లేని రికార్డును కలిగి ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ భారత కోచ్ ద్రవిడ్.

అత్యధిక వంద పరుగుల భాగస్వామ్యాలు: మిస్టర్ డిపెండబుల్ టెస్టుల్లో అత్యధికంగా వంద పరుగుల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కూడా పిలుస్తారు. మొత్తం 210 క్యాచ్‌లు ద్రవిడ్ పేరు మీద ఉన్నాయి.

క్రీజ్‌లో బ్యాట్స్‌మెన్ గడిపిన అత్యధిక నిమిషాలు: క్రీజులో అత్యధిక నిమిషాలు గడిపిన ఏకైక టెస్టు బ్యాట్స్‌మెన్ ద్రవిడ్ . అతను మొత్తం 735 గంటల 52 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. అంటే 44,152 నిమిషాలకు సమానం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dravid
  • Happy Birthday Dravid
  • indian cricket team
  • rahul dravid
  • Rahul Dravid Birthday
  • Team India head coach

Related News

'Best gift ever!'... Waiting to see how Rajkummar Rao beats my 'cover drive': Sourav Ganguly

Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘దాదా’గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీకి తన పుట్టినరోజున ఒక మర్చిపోలేని బహుమతి లభించింది. గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు ఆయన 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చిందని, ఇది తనకు లభించి

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd