HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Reveals Why India Refused To Run Shanaka Out Despite Shamis Appeal

Rohit Sharma: క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ.. ఏం చేశాడో తెలుసా..!

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న గువాహటిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్వితీయ విజయంతో ఆకట్టుకుంది. 67 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • By Gopichand Published Date - 11:25 AM, Wed - 11 January 23
  • daily-hunt
rohit
Resizeimagesize (1280 X 720) 11zon

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న గువాహటిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్వితీయ విజయంతో ఆకట్టుకుంది. 67 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక కెప్టెన్ దాసున్ షనక అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ప్రశంసలు అందుకున్నాడు.

మొత్తంగా 88 బంతులు ఎదుర్కొన్న షనక 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేసి తన ఖాతాలో మరో సెంచరీ వేసుకున్నాడు. అయితే.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చివరి ఓవర్ నాలుగో బంతి వేస్తున్న సమయంలో షనక నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అప్పటికి షనక సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. షమీ నాలుగో బంతిని సంధించక ముందే షనక క్రీజు వదిలి బయటకు వచ్చాడు. గమనించిన షమీ వికెట్లను గిరాటేసి అప్పీల్ చేశాడు. నిజానికైతే ఇది అవుటే. అయితే.. అనుమానం ఉన్న ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేశాడు. అయితే అప్పటికి షనక 98 పరుగులతో ఉండడంతో రోహిత్ శర్మ కల్పించుకున్నాడు. షమీతో మాట్లాడి అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో లంక కెప్టెన్ బతికిపోయాడు. ఆ బంతికి ఓవర్ త్రో కారణంగా ఐదు పరుగులు వచ్చాయి. స్ట్రయికింగ్‌కు వచ్చిన షనక ఐదో బంతిని బౌండరీకి పంపి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షనక సెంచరీ కోల్పోకుండా రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Captain @ImRo45 explains why he withdrew the run-out appeal at non striker’s end involving Dasun Shanaka.#INDvSL @mastercardindia pic.twitter.com/ALMUUhYPE1

— BCCI (@BCCI) January 10, 2023

మ్యాచ్ అనంతరం రోహిత్ తన ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. ‘షమీ ఇలా (రన్ అవుట్) చేశాడని నాకు తెలియదు. అతను (షనక) 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. మేము అతనిని ఇలా అవుట్ చేయలేకపోయాము. ఇది మనం అనుకున్నది కాదు. అతనికి హ్యాట్సాఫ్, అతను బాగా ఆడాడని తెలిపాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1st ODI
  • Ind vs SL
  • India wins
  • mohammad shami
  • rohit sharma

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Indian Cricketers

    Indian Cricketers: ఆన్‌లైన్ గేమింగ్ బిల్.. భారత క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ!

Latest News

  • Jr NTR : కనీసం నిల్చులేకపోతున్న ఎన్టీఆర్..గాయం పెద్దదే !!

  • BCCI: టీమిండియాకు 21 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ!

  • 42% BC Reservation G.O : రేవంత్ తీసుకున్న గొప్ప నిర్ణయానికి బిఆర్ఎస్ అడ్డు..

  • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

  • Mirai Movie: ‘మిరాయ్’ తో నిర్మాతకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో తెలుసా..?

Trending News

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd