HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >3 All Rounder Players Rcb Should Target In Ipl 2025 Mega Auction

IPL Mega Auction: ఆర్సీబీ టార్గెట్ ఆ ముగ్గురేనా..?

మెగా వేలంలో ఆర్సీబీ ముగ్గురు ఆల్ రౌండర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ పంజాబ్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లివింగ్‌స్టోన్ బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటగలడు. . లివింగ్‌స్టోన్ గత సీజన్‌లో రాణించలేకపోయాడు

  • Author : Vamsi Chowdary Korata Date : 28-08-2024 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ipl Mega Auction
Ipl Mega Auction

IPL Mega Auction: 2025 ఐపీఎల్ మెగా వేలంపై రకరకాల అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టే ఈ సారి వేలం రసవత్తరంగా సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. గత సీజన్లో తృటిలో టైటిల్ కోల్పోయిన ఆర్సీబీ ఈ సారి భారీ ప్రణాళికతో ఉంది. అందులో భాగంగా ఆల్ రౌండర్ ఆటగాళ్లని ఫోకస్ చేస్తుంది.

మెగా వేలంలో ఆర్సీబీ ముగ్గురు ఆల్ రౌండర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ పంజాబ్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లివింగ్‌స్టోన్ బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటగలడు. . లివింగ్‌స్టోన్ గత సీజన్‌లో రాణించలేకపోయాడు. 7 ఇన్నింగ్స్‌లలో 22.20 సగటుతో 111 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ ఫ్లాప్‌ అయి 3 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో పంజాబ్ అతన్ని విడుదల చేయాలనుకుంటుంది. దీంతో లివింగ్‌స్టోన్ వేలానికి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆర్సీబీ ఈ ఆల్ రౌండర్‌ను దక్కించుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టే ఛాన్స్ లేదు. గ్లెన్ ఫిలిప్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడుతున్నాడు. కానీ గత సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. టీ20 క్రికెట్‌లో గ్లెన్ ఫిలిప్స్ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ బౌలింగ్ ద్వారా కూడా జట్టుకు సహకారం అందిస్తాడు. ఫిలిప్స్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్. ఫిలిప్స్ లాంటి ఆటగాడికి రైజర్స్ జట్టు ఆడేందుకు అవకాశం కల్పించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకవేళ ఫిలిప్స్ వేలంలోకి వస్తే ఆర్సీబీ ఫిలిప్స్ ని వదులుకునే ప్రసక్తే ఉండదు.

అశుతోష్ శర్మ తన తొలి సీజన్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు, అద్భుతమైన ప్రదర్శన చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ముంబైతో జరిగిన ఓ మ్యాచ్ లో ఫోర్ల కంటే సిక్సర్లు కొట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి 2 ఫోర్లు, 7 సిక్సులు బాదాడు. చివరకు బుమ్రాను సైతం అతడు వదల్లేదు. బుమ్రా బౌలింగ్‌లో స్వీప్ షాట్‌తో సిక్సర్ బాదిన అశుతోష్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. విశేషం ఏంటంటే ఈ యువ ప్లేయర్ని ముంబై కేవలం 20 లక్షలకే కొనుగోలు చేసింది. అయితే అశుతోష్ మాత్రం 20 కోట్ల ఆట అడగలిగే ప్రతిభ ఉన్న ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 17 ఏళ్లఐపీఎల్ చరిత్రలో 8వ స్థానంలో ఆడుతూ ఒక సీజన్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా అశుతోష్ నిలిచాడు. అశుతోష్ 11 మ్యాచ్‌లలో 167.26 స్ట్రైక్ రేట్‌తో 189 పరుగులు చేశాడు. అతని హైయెస్ట్ స్కోర్ 61. ఒకవేళ అతను వేలానికి వెళితే ఆర్సీబీ అతనిని దక్కించుకునే అవకాశం ఉంది.

Also Read: MLC Kavitha Live: 500 కార్లతో బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవిత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • All-Rounder Players
  • cricket news
  • IPL 2025
  • Ipl updates
  • mega auction
  • rcb
  • sports news
  • Telugu Live News

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd