MLC Kavitha Live: 500 కార్లతో బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవిత
ఇంటికి చేరుకున్న కవిత మొదట తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయాయ్రు. ఈ సందర్భంగా సోదరుడు కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.
- Author : Praveen Aluthuru
Date : 28-08-2024 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
MLC Kavitha Live: 165 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న కవితకు ఆగస్టు 26న సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రాత్రి ఢిల్లీలోనే బస చేసిన కవిత ఈ రోజు ఆమె హైదరాబాద్ కు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలను చూసి కవిత భావోద్వేగానికి గురయ్యారు.

MLC Kavitha With KTR
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఆమె నివాసం వరకు 500 కార్లతో పార్టీ కార్యకర్తలు భారీ వాహనాల ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా ధ్వనులు, డప్పు చప్పుళ్లు ఆమె నివాసానికి సమీపంలో ప్రతిధ్వనించాయి. ఇంటికి చేరుకున్న కవిత మొదట తన తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసి ఆత్మీయ ఆలింగనం చేశారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సోదరుడు కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.

Kavitha
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆమె కడిగిన ముత్యంలా వస్తానని స్పష్టం చేసింది కవిత. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొంది. అంతిమంగా న్యాయం మరియు ధర్మమే గెలుస్తుందని చెప్పింది. ధర్మం కోసం పోరాడతాను అని కవిత తెలిపారు. ఈ సందర్భంగా కవిత తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. జైలు జీవితం అనంతరం ఆమె తెలంగాణకు, తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని అన్నారు.కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన తమ పార్టీ చేస్తున్న అనేక పోరాటాల్లో పాల్గొంటానని ఆమె తెలిపారు.

MLC Kavitha Live
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పతనావస్థలో ఉన్న తెలంగాణలో బీఆర్‌ఎస్ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కూడా ఓడిపోయింది. దీంతో రాష్ట్రంలో గులాబీ పార్టీ కష్టాల్లోకి వెళ్ళింది. గెలిచినా 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. ఇవి కాదన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసంలో మార్చి 15న అరెస్టు చేయగా, సీబీఐ ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను అరెస్టు చేసింది. మద్యం లైసెన్స్‌ల కోసం ఢిల్లీ అధికార ఆప్‌కి రూ. 100 కోట్ల కిక్‌బ్యాక్‌లు చెల్లించిందని ఆరోపించారు.
Also Read: Champai Soren Resigns: చంపై సోరెన్ రాజీనామా, ఉత్కంఠగా జార్ఖండ్ రాజకీయాలు