Mamata Banerjee: కాంగ్రెస్ ఓటమి , ప్రజలది కాదు: మమతా బెనర్జీ
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ ఓటమి అని, ప్రజలది కాదని అన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ నెగ్గింది
- By Praveen Aluthuru Published Date - 11:04 PM, Mon - 4 December 23

Mamata Banerjee: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ ఓటమి అని, ప్రజలది కాదని అన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ నెగ్గింది. అయితే ఓట్ల విభజన కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయిందని మమతా బెనర్జీ అన్నారు.భావజాలంతో పాటు వ్యూహం కూడా అవసరమని మమతా బెనర్జీ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలోపు ప్రతిపక్ష పార్టీల కూటమి కలిసికట్టుగా పనిచేసి తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పారు. తప్పుల నుంచి నేర్చుకుంటాం’ అన్నారు. ఇక మిజోరాంలో 40 స్థానాల్లో పోటీ చేసిన మమతా బెనర్జీ 1 స్థానంలో గెలుపొందారు.
Also Read: TDP : ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం : మాజీ మంత్రి కే.ఎస్ జవహార్