Vande Bharat Express: ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి
వందేభారత్ రైలు (Vande Bharat Express)పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగింది.
- By Gopichand Published Date - 07:08 AM, Mon - 19 June 23

Vande Bharat Express: వందేభారత్ రైలు (Vande Bharat Express)పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగింది. మీరట్-ముజఫర్‌నగర్ రైల్వే ట్రాక్‌లోని జరౌడ నర రైల్వే స్టేషన్ గుండా వెళుతుండగా రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో రైలు విండ్‌షీల్డ్‌లపై గీతలు పడ్డాయి. రైలులో ఉన్న కొందరు ప్రయాణికులు దీనిని వీడియో తీశారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ E1 కోచ్‌పై రాళ్ల దాడి జరిగిందని ANI తెలిపింది. రాళ్ల దాడిలో ఎవరూ గాయపడలేదు. నిందితుడిని పట్టుకునేందుకు ఢిల్లీలోని ఆర్పీఎఫ్ బృందం పనిచేస్తోందని రైల్వే శాఖ తెలిపింది. అయితే రాళ్ల దాడి ఘటనను జరౌడ నర రైల్వే స్టేషన్ మాస్టర్ కొట్టిపారేస్తున్నారు.
మే 29న రైలు ప్రారంభమైంది
మే 29న ప్రధాని నరేంద్ర మోదీ డెహ్రాడూన్ నుండి ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
Also Read: Goods Train Derailed : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ – కిరండోల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
ఆనంద్ విహార్ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఏడు రోజుల వ్యవధిలోనే మరోసారి రాళ్లు రువ్వారు. ముజఫర్‌నగర్ స్టేషన్ సమీపంలో రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం లేదు. రాళ్లదాడి చేసిన వారిని పట్టుకునేందుకు రైల్వే ఆర్పీఎఫ్‌కు అధికారులు సమాచారం అందించారు. రైల్వే శాఖ ప్రకారం.. ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో ముజఫర్‌నగర్ స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ E1 కోచ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ డివిజన్ ఆర్పీఎఫ్‌ను మోహరించింది.
జూన్ 12న రాళ్ల దాడి
అంతకుముందు.. జూన్ 12న రైలుపై రాళ్ల దాడి జరిగింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గత సోమవారం (జూన్ 12) సాయంత్రం ఆనంద్ విహార్ నుండి డెహ్రాడూన్ వెళ్తోంది. సహరాన్‌పూర్ చేరుకోకముందే తాప్రి-సహారన్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనతో రైలు కొంతసేపు నిలిచిపోయింది. పలుచోట్ల రైలు చైర్‌కార్ కోచ్ అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రైలును సహరాన్‌పూర్‌కు తీసుకువచ్చారు. ఇక్కడి నుంచి రైలు డెహ్రాడూన్‌కు చేరుకుంది.