Team India: టీమిండియాపై ప్రశంసల జల్లు.. కోహ్లీ సెంచరీకి ఫిదా!
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా కూడా కోహ్లీ నిలిచాడు. ఇది కాకుండా ఈ మ్యాచ్‌లో అతను తన 14 వేల వన్డే పరుగులను పూర్తి చేశాడు.
- By Gopichand Published Date - 10:56 PM, Sun - 23 February 25

Team India: దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు (Team India) సెమీస్‌కు చేరువైంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో పాటు శుభ్‌మన్ గిల్, కుల్‌దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు నిరాశపర్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ జట్టు దాదాపు టోర్నీ నుంచి వైదొలిగినట్లే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 10 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 242 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు శుభారంభం అందింది. రోహిత్ 20 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 46 పరుగులు చేశాడు. దీంతో పాటు శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. కోహ్లి 111 బంతుల్లో 100 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి పాకిస్థాన్‌ను చిత్తు చేశాడు. ఈ సమయంలో కింగ్ కోహ్లీ 7 ఫోర్లు బాదాడు.
Big Game 🏟️
Big Player 😎
Big Knock 💥King for a reason 👑
Updates ▶️ https://t.co/llR6bWyvZN#TeamIndia | #PAKvIND | #ChampionsTrophy | @imVkohli pic.twitter.com/oMOXidEGag
— BCCI (@BCCI) February 23, 2025
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ తరఫున సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా కూడా కోహ్లీ నిలిచాడు. ఇది కాకుండా ఈ మ్యాచ్‌లో అతను తన 14 వేల వన్డే పరుగులను పూర్తి చేశాడు.
Also Read: Rohit Sharma: వన్డేల్లో వేగంగా 9 వేల పరుగులు చేసిన టాప్- 5 ఓపెనర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శర్మ!
భారత జట్టుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించడంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన రోహిత్ సేనకు అభినందనలు తెలిపారు. ఇదే జోష్ తో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవాలని ఆకాంక్షించారు. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీకి అభినందనలు అని పేర్కొన్నారు.
Spectacular Win 🇮🇳!
The men in blue record an all round performance to beat Pakistan in the Champions Trophy. Excellent batting display by Virat Kohli.
Congratulations 🇮🇳and best wishes!#INDvsPAK #ChampionsTrophy pic.twitter.com/3HVx06JeNv
— G Kishan Reddy (@kishanreddybjp) February 23, 2025
వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేయటంపై జగన్ అభినందనలు అని పేర్కొన్నారు.
Great win for Team India against Pakistan in the ICC Championship Trophy! Congratulations on a well-deserved victory. Big congrats to @imVkohli on his brilliant century!#ICCChampionsTrophy#INDvsPAK pic.twitter.com/0DsedAlIEC
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 23, 2025