HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Should Excel In Hollywood As Well Cm Revanth Reddy

అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Author : Vamsi Chowdary Korata Date : 13-03-2026 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Reddy, Allu Arjun
Revanth Reddy, Allu Arjun

CM Revanth Reddy  అల్లు సినిమాస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్‌లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీల్లో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ వంటి చిత్రాల వసూళ్లతో పోటీపడాలని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సాంకేతికంగా తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియాలోనే కాదు, హాలీవుడ్‌లోనూ రాణించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ కోకాపేటలోని ‘ అల్లు సినిమాస్‌ ’ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమాలు ఇప్పటివరకూ హిందీ చిత్రాల కలెక్షన్స్ తో పోటీపడేవని చెప్పుకున్నామని, టెక్నికల్ గా ‘అవతార్‌’, ‘జురాసిక్ పార్క్’ లాంటి సినిమాలను మనమూ తీయాలని అన్నారు.

హైదరాబాద్ నగరానికి, సినిమా ఇండస్ట్రీకి గొప్ప గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమానికి అల్లు సినిమాస్ తో శ్రీకారం చుట్టారు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని కొనసాగించేలా, వారి జ్ఞాపకాలను సినీ అభిమానులకు తెలుగు ప్రజలకు గుర్తుండే విధంగా ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు అల్లు అర్జున్, అల్లు అరవింద్ లను, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను సినమా అభిమానిని. బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్ మన్ కలర్, 70MM, డాల్బీ, వీఎఫ్ఎక్స్.. ఇలా సాంకేతికంగా మన దేశంలో సినిమా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. యాదృచ్చితంగా ఇవాళే నెట్ ఫ్లిక్స్ సెంటర్ ను కూడా ప్రారంభించడం జరిగింది అని రేవంత్ రెడ్డి అన్నారు.

కల్కి, అరుంధతి, బాహుబలి లాంటి చిత్రాలను సాంకేతికంగా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా తెరకెక్కించారు. కానీ టెక్నాలజీ పరంగా సినిమాని ఎంత బాగా తీసినా, వాటిని ప్రదర్శించడానికి తగ్గ థియేటర్లు లేకపోతే వృథా అవుతుంది. షార్క్ 4లాంటి 3డీ సినిమాలు వచ్చినప్పుడు చాలా వింతగా చూసేవాళ్ళం. ఇంత పెద్ద థియేటర్ నేనెప్పుడూ చూడలేదు. కాలేజీ రోజుల్లో దేవి, మహేశ్వరి పరమేశ్వరి లాంటి థియేటర్లలో చాలా మంది ఆడియన్స్ తో పెద్ద స్క్రీన్ మీద సినిమా చూడటానికి అవకాశం కలిగేది. రానురాను చిన్న చిన్న స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లు వచ్చాయి. బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే ఫీలింగ్ మిస్ అయిపోయాం. ఇప్పుడు మళ్లీ డాల్బీ విజన్‌తో వందలాది మందితో కలిసి కూర్చొని సినిమా చూస్తే ఆ ఆనందమే వేరు

చెన్నై నుంచి హైదరాబాద్ కి ఇండస్ట్రీని తరలించడానికి ఆనాడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు కృషి చేశారు. సినీ రంగంలో నటశేఖర కృష్ణ గారు ఎన్నో ప్రయోగాలు చేశారు. కలర్ సినిమా, 70MM.. ఇలా అడ్వెంచర్స్ చేయాలంటే ఆరోజుల్లో కృష్ణ గారి ముందుండేవారు. చాలా ఎఫర్ట్ పెట్టారు. అప్పట్లో కృష్ణ ఒక ఏడాదిలో 15-16 సినిమాల్లో నటించి రిలీజ్ చేసేవారు. ఇప్పుడు ఐదారు సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. నేను కృష్ణగారి అభిమానిని. అందుకే ఈ వివరాలన్నీ నాకు తెలుసు

అప్పట్లో హైదరాబాద్, కర్నూలు లాంటి కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యేవి. మొదటి రోజు సినిమా చూడాలంటే, నేను వనపర్తి నుంచి కర్నూలుకు 100 కిలో మీటర్లు లారీలో ప్రయాణించి సినిమా చూసి వచ్చేవాడిని. అప్పట్లో బస్సులు ఎక్కువగా ఉండేవి కాబట్టి, టైముకి సినిమా చూడటానికి ఎక్కువగా లారీల్లో వెళ్లేవాళ్లం. సినిమా అనేది మధ్యతరగతి ప్రజలపై అంతగా ప్రభావం చూపిస్తుంది. మన లైఫ్ ని ఇన్స్పైర్ చేస్తుంది. జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేలా సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా కమర్షియల్‌ ఎలిమెంట్ కాదు. సామాజికంగా ప్రభావం చూపే ముఖ్యమైన అంశం. అందుకే దాన్ని క్యాజువల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు

తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని గొప్ప పరిశ్రమగా గుర్తిస్తోంది. కృష్ణానగర్‌ను చిన్నచూపు చూడొద్దు. గొప్ప సినిమాలు ఇచ్చిన కళాకారులెందరో అక్కడ ఉన్నారు. టికెట్ కొని సులభంగా సినిమాను జడ్జ్ చేస్తాం. సినిమా తీయడం ఎంత కష్టమో గుర్తించాలి. ‘అల్లు సినిమాస్’ అల్లు కుటుంబానికి ఒక ఎమోషన్‌. ఎంతో ఇష్టపడి అల్లు అరవింద్ దీనిని నిర్మించారు. అల్లు సినిమాస్ నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావాలి. ప్రభుత్వం తరఫున సినిమా పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తాం. అల్లు అర్జున్ పాన్ ఇండియాలోనే కాదు, భవిష్యత్తులో హాలీవుడ్‌లో కూడా రాణించాలి. హాలీవుడ్ వసూళ్లతో పోటీపడేలా తెలుగు సినిమా ఎదగాలి. అవతార్, జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలను మనమూ తీయాలి. సినిమాలకు నేడు భాషా సరిహద్దులు చెరిగిపోయాయి. సినీ రంగానికి ప్రతిభావంతులే కావాలి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu aravind
  • allu arjun
  • Allu Cinemas
  • CM Revanth Reddy
  • hollywood
  • hyderabad
  • Telangana CM Revanth Reddy
  • tollywood

Related News

We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

Revanth Warning : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR - Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

  • KTR warns CM Revanth

    KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

  • Do we not have the standing to meet NTR? This is the reason why we have come before the media!

    RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Good news for burger lovers: Burger Singh restaurant opens in Hyderabad.

    Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం

Latest News

  • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

  • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

  • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

  • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

  • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd