Saudi Arabia: సౌదీ కారు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ వాసులు
సౌదీ అరేబియా నుంచి కువైట్‌కు తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు
- Author : Praveen Aluthuru
Date : 27-08-2023 - 4:28 IST
Published By : Hashtagu Telugu Desk
Saudi Arabia: సౌదీ అరేబియా నుంచి కువైట్‌కు తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీ అన్నమయ్యలోని మదనపల్లెకు చెందిన దండు గౌస్ బాషా, కువైట్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు, అతని కుటుంబంతో సహా ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు వచ్చాడు, అందులో భార్య తబారక్ సర్వర్ మరియు ఇద్దరు కుమారులు – మూడేళ్ల ఇహాన్ మరియు ఎనిమిది నెలల దమీల్ ఉన్నారు. ఈ మధ్యే కొన్న కారులో సౌదీ నుంచికువైట్‌కు తిరిగి వస్తుండగా కారు ట్రైలర్‌ను ఢీకొట్టడంతో విషాదం జరిగింది. మృత దేహాలను రుమా జనరల్ ఆసుపత్రికి తరలించారు. విషాద వార్త విన్న గౌస్ బాషా తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. దీంతో వారిని బెంగుళూరులోని ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read: Jeff Bezos: అపర కుబేరుడు జెఫ్ బెజోస్ ఇంటి అద్ద తెలిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే?