Jeff Bezos: అపర కుబేరుడు జెఫ్ బెజోస్ ఇంటి అద్ద తెలిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే?
పెద్ద పెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు నివసించే ఇల్లు కోట్లు ఖరీదు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వ
- By Nakshatra Published Date - 04:15 PM, Sun - 27 August 23
పెద్ద పెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు నివసించే ఇల్లు కోట్లు ఖరీదు చేస్తాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వాళ్లు ఏదైనా వెళ్ళినప్పుడు కూడా అక్కడ 5 స్టార్ 7 స్టార్ హోటల్లో స్టే చేస్తూ ఉంటారు. ఇకపోతే కొంతమందికి ఇల్లు కొనే స్తోమత ఇళ్లు కట్టే స్తోమత ఉన్నా కూడా అద్దె ఇళ్లలోనే గడుపుతూ ఉంటారు. అటువంటి వారిలో ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఒకరు. ఇటీవల తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు, తన ఆస్తిని మొత్తం పక్కన బెట్టి.. ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే, ఆ ఇంటి అద్దె తెలిసి నోరెళ్లబెడుతున్నారు. జెఫ్ బెజోస్ కాబోయే భార్యతో కలిసి కాలిఫోర్నియా కాపురం పెట్టారట. హాలీవుడ్ మ్యుజిషియన్ కెన్నీ జీకి చెందిన ఈ భవనం 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆ భవనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రికార్డింగ్ స్టూడియో, స్విమ్మింగ్ పూల్, గార్డెన్స్ వంటి అనేక లగ్జరీ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో 3,500 చదరపు అడుగుల గెస్ట్‌హౌస్ కూడా ఉంది. అందుకే అదేస్థాయిలో దీని అద్దె కూడా వసూలు చేస్తున్నారు. నెలకు సుమారుగా 600000 డాలర్లు అనగానే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 కోట్లు అద్దెగా చెల్లిస్తున్నారట జెఫ్ బెజోస్.
జెఫ్ బెజోస్ జంట ఈ సంవత్సరం మార్చి నుండి ఈ ఆస్తిని అద్దెకు తీసుకున్నారు. అద్దె నెలకు సుమారు రూ. 5 కోట్లుగా ఉండగా బెజోస్ అతని కాబోయే భార్యకు చెందిన వస్తువులతో అలంకరించబడిందట. అయితే, హైదరాబాద్ లాంటి సిటీల్లో శివారు ప్రాంతాలకు వెళ్తే.. రూ.50 లక్షల వరకు ఇళ్లు కూడా దొరికే పరిస్థితి ఉంది. ఆ లెక్కన.. జెఫ్ బెజోస్ చెల్లించే అద్దెతో ఇక్కడైతే ఏకంగా పది ఇళ్లకు పైగా కొనుగోలు చేయవచ్చన్నమాట..
Tags
Related News
Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల వేళ హెలికాప్టర్లకు భారీగా డిమాండ్
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఇప్పటికే పూర్తి కావడంతో, మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు 80 శాతం ఉన్న మిగిలిన ఆరు దశలపై దృష్టి సారించింది. దీనికి ముందు రాజకీయ పార్టీలు ఛార్టర్ విమానాలు, హెలికాప్టర్లను కీలక సాధనాలుగా చేసుకుని ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.