Speed News
-
TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?
TTD: చంద్రగ్రహణం సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం మూసివేశారు అర్చకులు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలను మూసి ఉంచడం సాంప్రదాయం.
Date : 07-09-2025 - 6:15 IST -
Congress : 15న కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ : మహేష్ కుమార్ గౌడ్
ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ సభలో బీసీల సాధికారత, వారి రాజకీయ భాగస్వామ్యం గురించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు అని తెలిపారు.
Date : 07-09-2025 - 5:48 IST -
Ganesh Visarjan 2025: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం వేళ విషాదం… ఇద్దరు మహిళల మృతి
Ganesh Visarjan 2025: హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఈసారి విషాద ఛాయలు మిగిల్చాయి. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ప్రజలను షాక్‌కు గురి చేశాయి.
Date : 07-09-2025 - 5:07 IST -
HPCL : పెట్రోలియం కంపెనీపై పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు శ్రమించాయి. మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసి పడటంతో, పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Date : 07-09-2025 - 4:52 IST -
Japan : జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా ప్రకటన
అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) లో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, పార్టీ శ్రేణుల్లో నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎలక్షన్లలో LDPకి నిరాశాజనక ఫలితాలు దక్కాయి.
Date : 07-09-2025 - 4:34 IST -
BRS : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ జోరు..రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్
పార్టీ మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇది కీలకంగా మారనుంది. అధికారంలో ఉన్నప్పటి గ్లోరీని మళ్లీ సాధించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం మరియు భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.
Date : 07-09-2025 - 2:34 IST -
Mumbai : చెత్త ఏరిన సీఎం భార్య, స్టార్ హీరో
Mumbai : ఈ కార్యక్రమంలో ఆమె బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar)తో కలిసి పాల్గొన్నారు. నిమజ్జనాల కారణంగా బీచ్ మొత్తం అపరిశుభ్రంగా మారడంతో, దానిని శుభ్రం చేసి
Date : 07-09-2025 - 12:18 IST -
Heavy Rain in Warangal : వరంగల్ ను ముంచెత్తిన భారీ వర్షం
Heavy Rain in Warangal : భారీ వర్షాల కారణంగా నగరంలోని అండర్ బ్రిడ్జి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు
Date : 07-09-2025 - 11:35 IST -
Ganesh Laddu: వేలంలో గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
Ganesh Laddu: తెలంగాణ రాష్ట్రం నిర్మల్ పట్టణంలో మతసామరస్యం అద్భుతంగా వెల్లివిరిసింది. హిందూ సాంప్రదాయ పండుగ అయిన వినాయక చవితి సందర్భంగా ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Date : 07-09-2025 - 10:27 IST -
AP Liquor Scam : జైలు నుంచి విడుదలైన లిక్కర్ కేసు నిందితులు
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనానికి కారణమైన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు విజయవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు మేరకు వీరికి బెయిల్ మంజూరైంది.
Date : 07-09-2025 - 10:12 IST -
ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
నిందితులు ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, కోర్టు వాటిని తిరస్కరించింది. చివరికి శనివారం విచారణలో ముగ్గురికీ బెయిల్ మంజూరవ్వడం కేసులో కీలక పరిణామంగా నిలిచింది. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31, కృష్ణమోహన్ రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33 నిందితులుగా ఉన్నారు.
Date : 06-09-2025 - 5:10 IST -
MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల
MP Mithun Reddy : ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి, ఎన్నికల ప్రక్రియలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది
Date : 06-09-2025 - 4:51 IST -
CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.
Date : 06-09-2025 - 4:06 IST -
AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం
సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.
Date : 06-09-2025 - 3:41 IST -
Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి
భారీ భద్రత నడుమ, ఉత్సవసమితి సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం, 70 టన్నుల ఈ బడా గణేశుడిని క్రేన్ ద్వారా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ప్రతీ అడుగులోనూ "గణపతి బప్ప మోరియా" నినాదాలు మారుమోగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు గణనాథుని దర్శించుకునేందుకు ఎగబడ్డారు.
Date : 06-09-2025 - 2:03 IST -
Balapur laddu: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?
ఈ వేలంలో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ విజేతగా నిలిచారు. ఆయన అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకోవడంతో బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. గత ఏడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ, ఈసారి రూ.4.99 లక్షలు అధికంగా ధరను సాధించింది. ఇది ఇప్పటివరకు బాలాపూర్ లడ్డూ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం.
Date : 06-09-2025 - 11:12 IST -
Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి
అసలైన యాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమవ్వాల్సి ఉన్నా, కొద్దిపాటి ఆలస్యం కారణంగా గణపతిని వాహనంపై ప్రతిష్టించి, తర్వాత ఊరేగింపును ఘనంగా ప్రారంభించారు. భక్తులు వేలాదిగా గణనాథుడి దర్శనార్థం తరలివచ్చారు. శోభాయాత్ర సందర్భంగా ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో నగరం మార్మోగిపోయింది.
Date : 06-09-2025 - 10:46 IST -
AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా చర్యలు, ప్రజలకు చెందిన ప్రధాన సమస్యలు, విధానాల అమలుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయపరంగా కీలకంగా మారనున్నాయి.
Date : 05-09-2025 - 5:10 IST -
Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణకు కొత్త విద్యా విధానం అవసరం. ఇప్పటివరకు మిగిలిపోయిన ప్రభుత్వ పాఠశాలలను మార్గదర్శిగా మార్చేందుకు సమయమైందని సీఎం అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించామని చెప్పారు.
Date : 05-09-2025 - 3:11 IST -
AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్‌లకు ప్రభుత్వం ఆమోదం
ఈ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం కోసం రూ.217.10 కోట్ల నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తీసుకువచ్చిన ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు చేరువవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 05-09-2025 - 2:55 IST