HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Center Gave Sweet News To Andhra Pradesh

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపి కబురు..!

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో రూ.2,400 కోట్లతో ప్లాన్ చేశారు.

  • By Vamsi Chowdary Korata Published Date - 10:18 AM, Mon - 6 October 25
  • daily-hunt
BDL
bdl

రాష్ట్రానికి కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రాబోతోంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) రూ.1,200 కోట్లతో కొత్త క్షిపణులద యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రొపెల్లెంట్‌లను తయారు చేస్తుంది. ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఈ యూనిట్ వస్తుంది. దీనివల్ల 600 మందికి నేరుగా, 1,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయి. భారత సైన్యానికి అవసరమైన మిసైళ్లు, ఇతర ఆయుధాలను ఇక్కడ తయారు చేస్తారు. ఈ యూనిట్ కోసం బీడీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి 1,400 ఎకరాలు కావాలని అడిగింది. సంస్థ అధికారులు ఇప్పటికే దొనకొండ దగ్గర భూములను చూశారు. బీడీఎల్, డీఆర్‌డీవో సహకారంతో మిసైళ్లు, ఇతర ఆయుధాలను తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీపీఆర్‌ను బీడీఎల్ ప్రభుత్వానికి ఇచ్చింది.

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో రూ.2,400 కోట్లతో ప్లాన్ చేశారు. ఈ యూనిట్‌లో అత్యాధునిక రక్షణ పరికరాలను తయారు చేస్తారు. ఈ రెండు యూనిట్ల వల్ల రక్షణ పరికరాల తయారీ, పరిశోధనలలో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తుందని అధికారులు చెబుతున్నారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) సెన్సర్లు, కమ్యూనికేషన్, క్షిపణులు, తుపాకుల వంటి ఆయుధ వ్యవస్థలను సమన్వయం చేస్తుంది. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను తయారు చేస్తారు. అంతరిక్ష ప్రయోగాలు, సైన్యం కోసం వెయ్యి టన్నుల పేలోడ్ మోసే రాకెట్ మోటార్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. 2026 మార్చి నాటికి అనుమతులు వస్తాయి. 2028 మార్చికి నిర్మాణం పూర్తవుతుంది. 2028 సెప్టెంబరు నాటికి ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.

ఈ ప్రాజెక్టుకు కొన్ని మౌలిక సదుపాయాలు అవసరం. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నుంచి సుమారు 8 కిలోమీటర్ల రెండు లేన్ల అప్రోచ్ రోడ్డు కావాలి. రోజుకు 25 వేల కిలోవాట్ల విద్యుత్, రోజుకు 2 వేల కిలోలీటర్ల నీటి సరఫరా వ్యవస్థలు కూడా అవసరమని BDL ప్రతిపాదించింది. ఈ సదుపాయాలు యూనిట్ సజావుగా నడవడానికి తోడ్పడతాయి. బీడీఎల్‌కు ఈ యూనిట్ కోసం మొత్తం 1,346.67 ఎకరాల భూమి అవసరం. మొదటి దశలో రూ.650 కోట్లు, రెండో దశలో రూ.550 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ యూనిట్‌లో వెయ్యి టన్నుల ప్రొపెల్లెంట్ మోటార్లు, 130 సమీకృత ఆయుధ వ్యవస్థలు తయారు చేస్తారు. ప్రభుత్వం 317 ఎకరాలను ఎకరాకు రూ.7.73 లక్షల చొప్పున కేటాయిస్తుంది. మిగిలిన భూమిని సేకరించాలని యోచిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • APMissileManufacturingUnit
  • BDL
  • Madakasira
  • Sri Sathya Sai District

Related News

CM Chandrababu

CM Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోదీ ఫోన్‌!

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని సూచించారు.

  • Montha Cyclone

    Montha Cyclone: మొంథా తుపాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క సూచ‌న‌లు!

  • Kurnool Bus Accident

    Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి

  • Kurnool Bus Fire

    Kurnool Bus Fire: క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన బ‌స్సు, వీడియో ఇదే!

  • AI Curriculum

    AI Curriculum: ఇక‌పై హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: మంత్రి లోకేష్

Latest News

  • Harish Rao Father Died : హరీష్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్‌

  • ‎Jujube: రేగి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం!

  • ‎Hair Growth: పది రూపాయల పెరుగు ప్యాకెట్ తో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ఖాయం!

  • ‎Leaves Benefits: ఈ చిన్ని ఆకులతో షుగర్ తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు ఎన్నో లాభాలు!

  • Harish Rao Father Died : హరీశ్ రావు తండ్రి కన్నుమూత

Trending News

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

    • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

    • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd