Landslide: కొండచరియలు విరిగిపడి బస్సు ధ్వంసం.. 15 మంది దుర్మరణం!
ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగిలిన వారి కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
- By Gopichand Published Date - 08:25 PM, Tue - 7 October 25

Landslide: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఝండూత భల్లూ వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో (Landslide) ఒక బస్సు మట్టి కింద చిక్కుకుపోయింది. ఈ ఘటనలో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. ఝండూత (Jhandutta) ప్రాంతంలోని బర్తిన్ (Barthin) సమీపంలో ఉన్న ఒక కొండ అకస్మాత్తుగా విరిగిపడటంతో భారీగా మట్టి, శిథిలాలు బస్సుపై పడ్డాయి.
Also Read: Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట!
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగిలిన వారి కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరికొంతమంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రమాద వివరాలు
- కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక బస్సు శిథిలాల కింద చిక్కుకుంది.
- ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
- బర్తిన్ (Barthin) సమీపంలో ఒక కొండ అకస్మాత్తుగా విరిగిపడటంతో దాని శిథిలాలు, మట్టి నేరుగా బస్సుపై పడ్డాయి.
- దీంతో ప్రయాణికులు బస్సు లోపల మట్టి కింద చిక్కుకుపోయారు.
- సహాయక సిబ్బంది ఇప్పటివరకు 15 మంది మృతదేహాలను వెలికితీశారు.
- ప్రమాద స్థలంలో సహాయక, రెస్క్యూ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి.