Chennai: చెన్నైలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ (arch) కూలిపోవడంతో కింద పనిచేస్తున్న అనేక మంది వలస కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
- By Gopichand Published Date - 08:46 PM, Tue - 30 September 25

Chennai: మంగళవారం నాడు ఎన్నూరులోని ఉత్తర చెన్నై (Chennai) థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ స్థలంలో జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ (arch) కూలిపోవడంతో కింద పనిచేస్తున్న అనేక మంది వలస కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Also Read: Kantara Chapter 1: కాంతారా చాప్టర్ 1కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
గాయపడిన వారిని వెంటనే ఉత్తర చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని ఆవడి పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించబడింది.
ఉత్తర చెన్నైలోని థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ స్థలంలో జరిగిన ఘోర ప్రమాదంపై తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (TNEB) కార్యదర్శి, టీఏఎన్‌జీఈడీసీఓ (TANGEDCO) చైర్మన్ డాక్టర్ జె. రాధాకృష్ణన్ స్పందించారు. ఆయన వెంటనే స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, గాయపడిన కార్మికులను పరామర్శించారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని ఆవడి పోలీస్ కమిషనరేట్ తెలిపింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించబడింది.
మధురైలో ఆర్చ్ కూలి ఇద్దరికి గాయాలు
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మరో ప్రమాదాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మధురైలోని మాట్టుతవాని బస్ స్టాండ్ వద్ద ఉన్న ప్రసిద్ధ ఆర్చ్‌ను కూల్చివేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఒక ఎర్త్‌మూవర్ ఆపరేటర్ మరణించగా, కాంట్రాక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ఎంజీ రామచంద్రన్ పాలనలో 5వ ప్రపంచ తమిళ మహాసభల జ్ఞాపకార్థం 1981లో నిర్మించిన ఈ ఆర్చ్ రహదారి విస్తరణ కారణంగా అడ్డంకిగా మారింది. కూల్చివేత పనులు ప్రారంభం కాగానే ఆర్చ్ పిల్లర్ కూలిపోయి డ్రైవర్‌ను నలిపివేసింది. గాయపడిన కాంట్రాక్టర్‌కు ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చికిత్స అందించారు.