Rohit- Kohli: రోహిత్, కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా జట్టు ఇదే!
మరోవైపు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటీవలే ఆసియా కప్ T20 టైటిల్‌ను భారత్‌కు అందించిన సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
- By Gopichand Published Date - 03:25 PM, Sat - 4 October 25

Rohit- Kohli: ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన శుభ్‌మన్ గిల్‌కు రాబోయే ఆస్ట్రేలియా ODI సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్సీని అప్పగించడం ద్వారా బీసీసీఐ (BCCI) బహుమతిని ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం అధికారికంగా వెల్లడించింది. 26 ఏళ్ల గిల్‌ను ఈ నెల చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కు భారతదేశ కెప్టెన్‌గా నియమించారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit- Kohli) కూడా జట్టులో భాగమయ్యారు. శ్రేయస్ అయ్యర్‌ను ఉప-కెప్టెన్‌గా (వైస్-కెప్టెన్) ఎంపిక చేశారు.
కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా నియమించారు. అలాగే సంజూ శాంసన్ స్థానంలో రెండో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌కు వన్డే జట్టులోకి తొలిసారిగా పిలుపు అందింది. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా ODI జట్టులో చోటు దక్కించుకోగా.. ఆల్‌రౌండర్‌లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌కు సెలెక్టర్ల నుండి ఆమోదం లభించింది.
🚨 India’s squad for Tour of Australia announced
Shubman Gill named #TeamIndia Captain for ODIs
The #AUSvIND bilateral series comprises three ODIs and five T20Is against Australia in October-November pic.twitter.com/l3I2LA1dBJ
— BCCI (@BCCI) October 4, 2025
కెప్టెన్సీ కొనసాగిస్తున్న సూర్యకుమార్ యాదవ్
గత ఏడాది T20 ప్రపంచ కప్ టైటిల్‌ను, ఈ ఏడాది మార్చిలో ICC ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత్‌కు రోహిత్ శర్మ అందించారు. అయితే అతని నాయకత్వంలోనే భారత్ 2023 ODI ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటీవలే ఆసియా కప్ T20 టైటిల్‌ను భారత్‌కు అందించిన సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
సీనియర్లకు విశ్రాంతి
ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్న జస్‌ప్రీత్ బుమ్రాకీ ODI జట్టు నుండి విశ్రాంతి కల్పించారు. అయితే అక్టోబర్ 29 నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో బుమ్రా ఆడనున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయాల నుంచి కోలుకోనందున ఎంపికకు అందుబాటులో లేరు.
Also Read: ODI Captain: రోహిత్‌కు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా యువ ఆటగాడు?!
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్లు
భారత ODI జట్టు
- శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
భారత T20I జట్టు
- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.