India vs West Indies: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
- By Gopichand Published Date - 02:15 PM, Sat - 4 October 25

India vs West Indies: శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వెస్టిండీస్‌పై (India vs West Indies) ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో ఓడించి 1-0 ఆధిక్యం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టును భారత్ కేవలం రెండు సెషన్లలోనే 162 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీయగా, జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజాలు సెంచరీలు సాధించారు. జడేజా ఆఖరి వరకు నాటౌట్‌గా నిలవగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీతో రాణించాడు. మూడో రోజు ఆట ప్రారంభం కాకముందే భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో మ్యాచ్‌ను నాలుగో రోజుకు తీసుకెళ్లే ఉద్దేశం వారికి లేదని స్పష్టమైంది. బౌలర్లు కూడా అదే చేసి చూపించారు. మరోసారి వెస్టిండీస్‌ను భారత్ రెండు సెషన్లలోనే 146 పరుగులకు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 4 వికెట్లు తీయగా, సిరాజ్‌కు 3 వికెట్లు లభించాయి.
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ విజయం కారణంగా భారత్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో ప్రయోజనం లభించింది. ఈ గెలుపుతో భారత్ విజయం శాతం (Winning Percentage – PCT) పెరిగినప్పటికీ పట్టికలో దాని స్థానంలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. వెస్టిండీస్‌పై సాధించిన ఈ భారీ విజయం కూడా భారత్‌ను WTC పాయింట్ల పట్టికలో టాప్-2లోకి చేర్చలేకపోయింది. టీమిండియా ఇప్పటికీ మూడవ స్థానంలోనే కొనసాగుతోంది.
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, శ్రీలంక రెండవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం ఎటువంటి మ్యాచ్ ఓడిపోకుండా, డ్రా చేసుకోకుండా ఉండటం వలన వారి ఆధిపత్యం కొనసాగుతోంది.
పాయింట్ల పట్టికలో చూస్తే
- ఆస్ట్రేలియా ఖాతాలో 100 శాతం పాయింట్లు ఉన్నాయి.
- శ్రీలంక ఖాతాలో 66.67 శాతం పాయింట్లు ఉన్నాయి.
- భారత్ ప్రస్తుతం 55.56 శాతంతో మూడో స్థానంలో ఉంది.