Speed News
-
Revanth calls: రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం!
తెలంగాణ లో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఎవరు సంతోషంగా లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలన వల్ల ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామనే సంతృప్తి కూడా లేకుండా చేస్తున్నారని రేవంత్ తెలిపారు.
Published Date - 03:10 PM, Fri - 31 December 21 -
America: కరోనా కేసులతో అమెరికా విలవిల..
కరోనావైరస్ ధాటికి అగ్రదేశం అమెరికా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 5.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న వారాల్లో ఒమిక్రాన్ తుపాను దేశాన్ని ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అగ్రదేశంలో చిన్నారులు రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరుతుండటం కలవరపెడుతోంది. ఇప్పుడు మనకు ని
Published Date - 03:05 PM, Fri - 31 December 21 -
Vijayawada: రేపట్నుంచే 32వ పుస్తక మహోత్సవం ప్రారంభం
ఈ నెల 11వ తేదీ వరకు జరిగే పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కన్వీనర్ విజయకుమార్ తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్వహించే పుస్తక మహోత్సవంలో 210 స్టాల్స్ ను ఏర్పాటు చేశామని.. 10 శాతం రాయితీతో పుస్తకాలను అందించనున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ పుస్తక మహోత్సవం ప్రతిరోజూ మధ్యా
Published Date - 02:49 PM, Fri - 31 December 21 -
Ayyappa: జనవరి 14న మకరజ్యోతి దర్శనం
కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అయ్యప్ప దర్శనానికి భక్తులు బారులు తీరారు. అయ్యప్పమాలను ధరించిన స్వాములు ఇరుముడితో ఆలయానికి చేరుకుని.. అయ్యప్పను దర్శించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో భక్తులకు కరోనా ప
Published Date - 02:41 PM, Fri - 31 December 21 -
Pushpa: పుష్పలో తొలగించిన సన్నివేశం ఇదే..
అల్లు అర్జున్ హీరోగా.. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. అయితే, సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు. అందులో ఓ సన్నివేశాన్ని తాజాగా చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. తొలగించిన సీన్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఇదిగో ఆ సన్నివేశాన్ని మీరూ చూసేయండి మరి.
Published Date - 02:34 PM, Fri - 31 December 21 -
Gujarat: బహుభార్యత్వం ప్రోత్సహించాల్సినది కాదు: గుజరాత్ హైకోర్టు
ఓ ముస్లిం మహిళ వేసిన పిటిషన్ కు సంబంధించిన కేసుపై తీర్పు ఇస్తూ గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళను భర్తతో కాపురానికి బలవంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ముస్లిం చట్టం బహుభార్యత్వం అనుమతించినా కానీ.. భర్తతో కలసి జీవించబోనని తిరస్కరించే హక్కు భార్యకు ఉంటుందని స్పష్టం చేసింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో భార్య భర్త నుండి విడాకులు
Published Date - 01:19 PM, Fri - 31 December 21 -
New Josh: ‘31st’ సెలబ్రేట్ చేసుకోవాలా.. వద్దా..?
డిసెంబర్ వచ్చిందంటే చాలు ప్రపంచమంతా న్యూ ఈయర్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. ఒకర్ని ఒకరు పలకరించుకుంటే చాలు 31st ప్లాన్స్ ఏంటి? ఎక్కడ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు అనే చర్చ తప్పకుండ ఉంటుంది. అయితే సెలెబ్రేషన్ అనే కాన్సెప్ట్ పై ఫిలాసఫర్స్ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Published Date - 01:07 PM, Fri - 31 December 21 -
బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా..ఎన్నికల్లో హవా
సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి అధిక సీట్లు వస్తాయి కానీ కర్ణాటకలో మాత్రం ఇందుకు విరుధంగా ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చాటింది. కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గత సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలన
Published Date - 12:37 PM, Fri - 31 December 21 -
18.16 lakh cases: వామ్మో.. ఒకరోజు ఇన్ని లక్షల కేసులా?
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Published Date - 12:02 PM, Fri - 31 December 21 -
Kashmir: కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్‌లోని పంథా చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిలో
Published Date - 11:51 AM, Fri - 31 December 21 -
Vijay’s glimpse: ఫస్ట్ పంచ్ అదిరింది.. లైగర్ గ్లింప్స్ ఇదిగో!
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి కలయిలకలో రూపుద్దిద్దుకుంటున్న మూవీ లైగర్. ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 11:49 AM, Fri - 31 December 21 -
Punjab: రాహుల్ గాంధీ పై పంజాబ్ కాంగ్రెస్ ఫైర్
రాహుల్ గాంధీ పై మరోసారి పంజాబ్ కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి 3న మోగా జిల్లాలో రాహుల్ గాంధీ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అయన న్యూ ఇయర్ వేడుకల కొరకు ఇటలీ వెళ్లారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర పార్టీ నేతలు ర్యాలీ ని రద్దు చేసుకున్నారు. అనేక గ్రూపులుగా ఏర్పడ్డ పంజాబ్ కాంగ్రెస్ ను ఒక వేదిక పైకి తీసుకురావ
Published Date - 11:36 AM, Fri - 31 December 21 -
Bribes: రెవెన్యూ అధికారులే పట్టుబడుతున్నారు!
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన ప్రభుత్వోద్యోగుల్లో సగంమందికిపైగా రెవెన్యూ శాఖలో పనిచేసేవారే ఉన్నారని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వార్షిక నివేదిక విడుదల చేసింది. 2021లో మొత్తం 72 ట్రాప్ కేసులు నమోదవగా.. అందులో 36 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారని తెలిపింది. లంచం తీసుకుంటూ దొరికిన వారిలో రెవెన్యూతో పాటు ఇంధన, పంచాయతీరాజ్, హోం శాఖ
Published Date - 11:30 AM, Fri - 31 December 21 -
5% GST: ఈ కామర్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకుంటే 5 శాతం జీఎస్టీ
అమరావతి: ప్రైవేటు ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై ఏపీఎస్ఆర్టీసీ 5 శాతం జీఎస్టీ విధించింది. ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1వ తేదీ నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ పోర
Published Date - 11:20 AM, Fri - 31 December 21 -
Mumbai: ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం- ఇంటెలిజెన్స్
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ అలర్ట్ అయింది. న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ గా చేసుకొని కాళిస్థని ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. వెంటనే అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సెలవులను రద్దు చేస్తూ అందరిని విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసి
Published Date - 10:58 AM, Fri - 31 December 21 -
TS DGP: రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం!
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.
Published Date - 07:58 PM, Thu - 30 December 21 -
New Year Traffic:న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు!
డిసెంబర్ 31 అర్థ రాత్రి జరిగే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ పలు ఆదేశాలు జారీ చేసారు. జనవరి 1న హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకల కోసం పలు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Published Date - 07:40 PM, Thu - 30 December 21 -
Telangana: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
కేంద్ర సాహిత్య అకాడమీ 2021 అవార్డులను గురువారం ప్రకటించింది. మొత్తం 20 భాషలకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్లు సాహిత్య అకాడమీ పేర్కొంది. కవితల విభాగంలో తెలుగు కవి గోరటి వెంకన్నకు ఈ పురస్కారం లభించింది. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి గాను ఈ పురస్కారాన్ని ప్రకటించారు. కవితల విభాగంలో మవాడీ గహాయి(బోడో), సంజీవ్ వెరెంకర్(కొంకణి), హృషీకేశ్ మాలిక్(ఒడియా), మీథే
Published Date - 05:56 PM, Thu - 30 December 21 -
Award Winning: భారత ఫొటోగ్రాఫర్లకు ‘యునిసెఫ్’ అవార్డులు
ఒక చిత్రం.. వేల భావాలకు సమానం.
Published Date - 05:38 PM, Thu - 30 December 21 -
Cricket: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై భారత్ 113 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎల్గర్ (77), బవుమా (35), డికాక్ (21) మినహా మిగ
Published Date - 05:21 PM, Thu - 30 December 21