ఆత్మకూరు ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మతసామరస్యం నెలకొనేలా చూడాలని సోము వీర్రాజు గవర్నర్ ని కోరారు. ఆత్మకూరులో అల్లర్లు, దహనకాండకు పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేయాలని.
- By Hashtag U Published Date - 11:36 AM, Thu - 13 January 22

కర్నూల్ జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మతసామరస్యం నెలకొనేలా చూడాలని సోము వీర్రాజు గవర్నర్ ని కోరారు. ఆత్మకూరులో అల్లర్లు, దహనకాండకు పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేయాలని.. దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను అభ్యర్థించారు.
గతనెల 8న ఆత్మకూరులో జరిగిన ఘటనలో వందలాది మంది సంఘవిద్రోహులు నంద్యాల బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేసిందని గవర్నర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో వీర్రాజు తెలిపారు. హిందువుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో “మసీదు అక్రమ నిర్మాణం”కి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు ఏడాది క్రితం హిందువులు మసీదు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారని..దీంతో ఆ నిర్మాణం ఆగిపోయిందని గవర్నర్ కు తెలిపారు. కానీ స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మద్దతుతో మసీదు నిర్మాణానికి ప్రయత్నం జరిగిందని బీజేపీ నాయకుడు ఆరోపించారు.
ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి కొంతమంది జర్నలిస్టులతో కలిసి నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారని, దుండగులు వారిపై ఆయుధాలతో దాడి చేశారని బీజేపీ నేత ఆరోపించారు.